Revanth Reddy Komati reddy: కాంగ్రెస్ పార్టీని ఎవరో వచ్చి ముంచాల్సిన పని లేదు. వాళ్లకు వాళ్లే ముంచుకుంటారని ఒక బ్యాడ్ టాక్ ఉంది.. ప్రపంచంలోనే ఏ పార్టీలో లేని ప్రజాస్వామ్యం కాంగ్రెస్ లో ఉంటుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి సపోర్టు చేయొచ్చు.. అధినేత్రి సోనియాగాంధీని తిట్టొచ్చు. అరే.. ఏమైనా చేయొచ్చు.. అంత స్వేచ్ఛ ఏ పార్టీలో ఉండదు భయ్. వాళ్లకు వాళ్లే తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు.. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు పిచ్చ లైట్. అస్సలు ఎవరూ పట్టించుకోరు..
కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు 23మంది తిరుగుబావుటా ఎగురవేసి అధినేత్రి సోనియాగాంధీకి అసమ్మతి లేఖలు రాసినా ఆ పార్టీ వారిని తీసేయలేదు. చర్యలు తీసుకోలేదు. అంతటి చపలచిత్వం గల స్వాతంత్య్రం కాంగ్రెస్ పార్టీ సొంతం.
ఇక కేంద్రంలోనే కాదు.. రాష్ట్రంలోనూ అదే కథ. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో సీనియర్లు భగ్గుమన్నారు. పోటీపడ్డ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే గాంధీభవన్ గడప తొక్కనని శపథం చేశాడు. కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయిందని.. 50 కోట్లకు పీసీసీ సీటు అమ్మేశారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?
కట్ చేస్తే ఇదే కోమటిరెడ్డి ఇప్పుడు కోపం చల్లారి వరి దీక్షలో రేవంత్ రెడ్డితోపాటు పాల్గొని నిరసన తెలుపుతూ కుశల ప్రశ్నలు వేశారు. రేవంత్ రెడ్డి-కోమటి రెడ్డి నవ్వులు చూసి కాంగ్రెస్ కార్యకర్తల కడుపు చల్లబడింది. ఇద్దరు బద్ద విరోధలు కలిసిపోవడంతో కాంగ్రెస్ లో కొత్త జోష్ వెల్లివిరిసింది.
రేవంత్ రెడ్డి-కోమటిరెడ్డి కలయిక వెనుక ఎవరున్నారని అనుకుంటున్నారు. మన సీనియర్ మోస్ట్ తాత గారు వీ హనుమంతరావు. ఈ ఉప్పు నిప్పులను కలిపేసి వారి వేడిపై నీళ్లు చల్లి కలిపేసిన ఘనత ఈ ముసాలయానకే దక్కింది. మరి ఈ నవ్వులు ఎంతకాలమో చూద్దాం.
Also Read: బోరున ఏడిస్తే వర్కవుట్ కాదు బాబూ.. జగన్ పైనా ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు