Revanth Reddy: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సయోధ్య కుదిరిందా?

Revanth Reddy: కాంగ్రెస్ లో అసమ్మతి మెల్లగా తొలగిపోతోంది. ఇన్నాళ్లు పార్టీలో ఉన్న విభేదాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు సైతం తమలోని భేషజాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా కలిసిపోయేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో వరి దీక్ష సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఒకే వేదికపై కనిపించి అందరిని ఆశ్చర్యపరచారు. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంలా ఉన్న నేతల్లో సఖ్యత రావడంపై కార్యకర్తల్లో సంబరం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి […]

Written By: Neelambaram, Updated On : November 27, 2021 5:10 pm
Follow us on

Revanth Reddy: కాంగ్రెస్ లో అసమ్మతి మెల్లగా తొలగిపోతోంది. ఇన్నాళ్లు పార్టీలో ఉన్న విభేదాలు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీనియర్లు సైతం తమలోని భేషజాలు పక్కన పెట్టి మూకుమ్మడిగా కలిసిపోయేందుకు సిద్ధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో వరి దీక్ష సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు ఒకే వేదికపై కనిపించి అందరిని ఆశ్చర్యపరచారు. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంలా ఉన్న నేతల్లో సఖ్యత రావడంపై కార్యకర్తల్లో సంబరం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని చెబుతున్నారు.

Revanth Reddy, Komatireddy

టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు పోటీ పడినా చివరి క్షణంలో పదవి రేవంత్ రెడ్డిని వరించింది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలకబూని అధిష్టానంపైనే నేరుగా విమర్శలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనకుండా తన వ్యతిరేకత ప్రదర్శించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం సైతం ఆందోళన చెందింది. పార్టీని గాడిలో పెట్టే అవకాశాలను వెతికింది.

Also Read: CM KCR: ఢిల్లీ టూర్‌తో ఫెయిల్ తో మౌనంగా సీఎం.. కొత్త ప్లాన్ ఏంటి ?

చివరకు వీహెచ్ జోక్యంతో కోమటిరెడ్డి దారికి వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య వీహెచ్ సంధానకర్తగా పనిచేసినట్లు సమాచారం. దీంతో వారిద్దరి మధ్య ఉన్న విభేదాలు పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ఇది మంచి పరిణామమే అని అందరు భావిస్తున్నారు. కొద్ది కాలంగా కష్టాల్లో ఉన్న పార్టీని ప్రస్తుతం గాడిలో పెట్టేందుకు నేతలు సిద్ధం కావాలని పిలుపునిస్తోంది.

మొత్తానికి రెండు ధృవాలు ఒకే వేదికపై కలవడంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్తేజం పెరుగుతోంది. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య సయోధ్య కుదిర్చేందుకు నేతలు పలు మార్గాలు వెతికారు. ఇద్దరిని ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు అందరు ప్రయత్నాలు చేసినా వీహెచ్ మాత్రం చొరవ చూపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారిద్దరితో ముఖాముఖి మాట్లాడించినట్లు తెలుస్తోంది.

Also Read: Hyderabad: హైద‌రాబాద్ లో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌

Tags