Rishi Sunak: రిషి సునాక్.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది ఈ పేరు. ఏ దేశస్థుల పాలనలో వందల ఏళ్లు భారత్ మగ్గిపోయిందో.. .. ఇప్పుడు అదే దేశానికి భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఎన్నిక కావడం అరుదైన పరిణామమే. రిషి సునాక్ ది అనూహ్య విజయం కాదు.దారిపొడవునా ఆటుపోట్లు, ముళ్లూ దాటుకుంటూ ఈ స్థానానికి చేరుకున్నారు. బ్రిటీష్ గవర్నమెంట్ అత్యంత క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు గట్టెక్కించగల గురుతర బాధ్యతను తీసుకున్నారు. స్వదేశీ నేతలు గడ్డు పరిస్థితులను గట్టెక్కించలేక చేతులెత్తేశారు. అటువంటి సమయంలో నేను ఉన్నాను అంటూ భరోసా ఇస్తూ ప్రధాని బాధ్యతలు తీసుకోవడానికి ముందుకొచ్చారు రిషి సునాక్. ప్రస్తుతానికి ఇది బ్రిటన్ గవర్నమెంట్ ఇష్యూ అయినా.. భారత సంతతికి చెందిన పాలకుడు కావడంతో అటు బ్రిటన్ తో పాటు ఇటు ఇండియా పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతున్నాయి. అగ్రదేశాల జాబితాలో ఉన్న ఇంగ్లండ్ శక్తివంతమైన దేశమే. ఆ దేశానికి ప్రధాని అయ్యో యోగ్యత ఒక భారత సంతతికి చెందిన వ్యక్తికి దక్కడంతో ఉప ఖండంలో సైతం ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.

ప్రపంచంలో ఓ అగ్రదేశానికి అతి పిన్న వయసులో ప్రధాని అయ్యే అరుదైన అవకాశం దక్కినా.. తన మూలాలను మాత్రం రిషి సునాక్ మరిచిపోలేదు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు దీపావళి పర్వదినాన్ని జరుపుకున్న వేళ రిషి సునాక్ పదవికి ఎంపికయ్యారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన బ్రిటన్ కు ప్రధానమంత్రిగా ఎంపిక కావడం యాదృశ్చికమైనా.. హిందువులు మాత్రం దైవ సంకల్పంగా భావిస్తున్నారు. రాజకీయాల కోసం కులం, మతం, ప్రాంతాన్ని మార్చేసుకుంటున్న ఈ తరుణంలో రిషి సునాక్ వ్యవహారం అందర్నీ ఆకట్టుకుంది. బ్రిటన్ హౌస్ ఆఫ్ కామన్స్ కు సభ్యుడిగా ఎన్నికైన సమయంలో ఆయన భగవద్దీతపై ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. అటు తరువాత తాను హిందూ మూలాలను మరిపోలేదని.. ఇక ముందు మరిచిపోనని కూడా స్పష్టం చేశారు. తన అత్తమామలు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, సుధామూర్తిలే తనకు ఇన్స్ప్రరేషన్ అంటూ చెప్పుకొచ్చారు.

రిషి సునాక్ బ్రిటన్ పొలిటిక్స్ లో ఎంట్రీయే కాదు.. సుదీర్ఘ కాలం ఆయన చేసిన పోరాట ఫలితమే ప్రధాని పదవి. కన్జర్వేటివ్ పార్టీలో యువతరం నాయకుడిగా ప్రవేశంచిన సునాక్.. తరువాత క్రమంలో నాయకుడిగా ఎదుగుతూ వచ్చారు. దేశం సంక్లిష్టంగా ఉన్న సమయంలో అందరి చూపు సునాక్ పై పడిందంటే ఆయన నాయకత్వ పటిమను ఎంతగా రాటు దేల్చుకున్నారో అవగతమవుతుంది. ఆర్థిక మంత్రిగా మంచి ఫలితాలను సాధించి.. ఇప్పుడు ఏకంగా ప్రధాని అయ్యే చాన్స్ కొట్టేశారు రిషి సునాక్.