Rishi Sunak- Chiranjeevi: బ్రిటన్ ప్రధానిగా భారత మూలాలున్న రిషి సునక్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా పెద్ద న్యూస్ అయ్యింది. భారత మూలాలున్న వ్యక్తి బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధాని కావడం విశేషంగా మారింది. ఇటీవల బ్రిటన్ ఎన్నికలు జరిగాయి. లిజ్ స్ట్రాస్ యూకే ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే లిజ్ స్ట్రాస్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో రిషి సునక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ పరిణామాన్ని భారతీయుడు అద్భుత ఘట్టంగా అభివర్ణిస్తున్నారు.

వందల ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో బానిసలుగా బ్రతికిన భారతీయులలో ఒకరు వాళ్ళ పాలకుడిగా మారడం ఊహించని పరిమాణం.రిషి సునక్ బ్రిటన్ రాజకీయాల్లో చాలా వేగంగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రవేశం చేసిన ఏడేళ్లల్లో ఈ అత్యున్నత పదవిని అందుకున్నారు. రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా ఎంపికయ్యారన్న న్యూస్ వచ్చినప్పటి నుండి భారత్ లో పండుగ వాతావరణం నెలకొంది. రిషి సునక్ ని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో బెస్ట్ విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా చిరంజీవి స్పందించారు. మెగాస్టార్ తన ట్వీట్ లో … ‘బ్రిటీష్ వాళ్ళ నుండి స్వాతంత్య్రం పొందిన 75ఏళ్లకు ఒక భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి బిటన్ ప్రధాని అవుతాడని ఎవరు మాత్రం ఊహిస్తారు. యూకేకి మొట్టమొదటి హిందూ ప్రధానిగా రిషి సునక్ బాధ్యతలు చేపట్టారు..’ అని కామెంట్ చేశారు. పాలించిన వారికి పాలకుడు కావడం ఎవరూ ఊహించలేదు. అది కూడా స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 75 ఏళ్లకు ఈ పరిణామం జరగడం అద్భుతం అన్న అభిప్రాయం చిరంజీవి తన ట్వీట్లో వెల్లడించారు.

ప్రస్తుతం చిరంజీవి ట్వీట్ వైరల్ అవుతుంది. నిన్నటి నుండి ట్విట్టర్ లో రిషి సునక్ పేరు ట్రెండ్ అవుతుంది. రాజకీయ,సామాజిక,సినిమా ప్రముఖులు, వ్యాపారవేత్తలు రిషి సునక్ కి అభినందనలు తెలుపుతున్నారు. రిషి సునక్ యూకే ప్రధాని కావడాన్ని అపూర్వ విజయంగా భారతీయులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్-బ్రిటన్ మధ్య సంబంధాలు బలపడే సూచనలు కలవు.