British Prime Minister race : బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ రాజీనామా తరువాత ఆ దేశ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా నెలకొంది. ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన రిషి సునక్.. తాను కన్జర్వేటివ్ పార్టీ తరుపున పోటీలో ఉన్నానని ఓ వీడియో రిలీజ్ చేశాడు. అయితే తాజాగా మరో ఆసక్తికర చర్చ మొదలైంది. ఇదే పార్టీ నుంచి తాను కూడా బరిలో ఉన్నానంటూ సుయెల్లా బ్రేవర్ మాన్ కూడా మీడియాకు తెలిపారు. దీంతో భారత సంతతికి చెందిన ఇద్దరు ఇతర దేశ ప్రధాని పదవికి పోటీ చేయడం ఆసక్తిగా మారింది. అయితే ఒకే పార్టీ నుంచి ఇద్దరు బరిలో ఉన్నానంటూ ఎవరికి వారు చెప్పిన తరుణంలో ఎవరు ముందుకు వెళ్తారోనని ఎదురుచూస్తున్నారు. దీంతో భారత రాజకీయం ఇతర దేశంలో మొదలైందన్న చర్చ జోరుగా సాగుతోంది.
బ్రిటన్ ప్రధానిగా ఉన్న బోరిస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ 42 మంది మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో బోరిస్ జాన్సన్ ఈనెల 6న తన పదవికి రాజీనామా చేశారు. బోరిస్ ప్రబుత్వంలో ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్న రిషి సునక్ తాను ప్రధాని పదవి రేసులో ఉన్నట్లు శుక్రవారం ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు మిగతా వారు మద్దతు ఇస్తే ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావించారు. అయితే ఇదే సమయంలో భారత సంతతికి చెందిన 42 ఏళ్ల న్యాయవాది సుయెల్ల సైతం ప్రధాని బరిలో ఉన్నట్లు బుధవారం రాత్రి ఓ మీడియాకు తెలిపినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో ఇప్పుడు ప్రధాని పదవి పోటీకి ఇద్దరు భారత సంతతికి చెందిన వ్యక్తులే పోటీ పడే అవకాశం ఉంది.
భారత సంతతికి చెందిన రిషి సునక్ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అల్లుడు. ఈయన సౌతాంప్టన్ లో జన్మించారు. వీరి పుర్వీకులు పంజాబ్ కు చెందిన వారు. పంజాబ్ నుంచి వెళ్లి తూర్పు ఆఫ్రికాలో నివాసం ఉండి బ్రిటన్ వెళ్లిన ఆయన తల్లిదండ్రులు అక్కడే నివసిస్తున్నారు. రిషి వించెస్టర్ కాలేజీ ప్రైవేట్ స్కూల్ లో ప్రాథమిక విద్య చదివాడు. అనంతరం ఆక్స్ ఫర్డ్ లో పై చదువులు చదివారు . కన్జర్వేటివ్ పార్టీ తరుపున 2 015లో నార్త్ యార్క్ షైర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 2019 నుంచి 2020 వరకు బ్రిటన్ ట్రెజరీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సునక్ అప్పటి నుంచి 2022 వరకు ఖజానాకు ఛాన్స్ లర్ గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటన్, భారత్ సంబంధాలు ఇంకా కొనసాగుతాయని పేర్కొన్నారు.
అటు సుయెల్లా బ్రేవర్ మాన్ భారత సంతతికి చెందిన క్రిస్టీ, ఉమా ఫెర్నాండేజ్ లకు జన్మించారు. ఆమె తండ్రి గోవా సంతతికి చెందిన వారు. బ్రేవర్ మాన్ కేంబ్రిడ్జిలో లా చదివారు 2005లో లీసెస్టర్ ఈస్ట్ నుంచి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2020లో ఇంగ్లాండ్, వేల్స్ కు అటార్నీ జనరల్ గా నియమితులయ్యారు. ఓ వైపు న్యాయవాదిగా మరోవైపు అటార్నీ జనరల్ గా బోరిస్ టీంలో కొనసాగుతున్నారు.
అయితే ఇప్పుడు ఇద్దరు ఇండియన్స్ ఇంగ్లండ్ పీఎం రేసులో ఉండడంతో కుట్రలు మొదలయ్యాయి. వీరిపై కొందరు ఇంగ్లండ్ జాతీయులు విష ప్రచారం మొదలుపెట్టారు. వీరిపై అవినీతి ఆరోపణలతోపాటు వేరే దేశస్థులు ఇంగ్లండ్ కు ప్రధాని కావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. . రిషి సునక్ కు ఇప్పటికే ప్రజల్లో ఆదరణ ఉంది. ఆర్థిక మంత్రిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అటు సుయెల్లా మహిళాగా తనకే మద్దతు ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ ప్రధానిగా భారతీయులు కావద్దని కొందరు సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు.
రాజకీయ విశ్లేషకుడు జో ఆర్మిటేజ్ ట్వీట్ చేస్తూ.. ‘చిన్న పడవలో యూరప్ కు సుయెల్లా తండ్రి, క్రిస్టీ ఫెర్నాండెజ్ నైరోబీ నుంచి యూకేకి వలస వచ్చారు. భారత్ లోని గోవాలోని అస్సాగావోకు చెందిన వారు. ఆమె తల్లి ఉమ మారిషస్‌లో జన్మించారు. బ్రేవర్‌మాన్ కు ప్రధానిగా ఒక్క అవకాశం ఇస్తే ఆమె బయటి వ్యక్తిగా పరిగణించబడతాడు.ఒక భారతీయురాలికి బ్రిటన్ ప్రధాని పదవినా’ అంటూ ట్వీట్ లో విమర్శలు గుప్పించారు.
ఇక “మా తదుపరి ప్రధానమంత్రిగా సుయెల్లా బ్రేవర్‌మాన్? భయపడండి, చాలా భయపడండి” దీని ద్వారా పాత్రికేయుడు సన్నీ హుండాల్ విమర్శలు గుప్పించారు.
“రిషి సునాక్, ప్రతి పటేల్ మరియు బ్రేవర్‌మాన్ సిగ్గు లేకుండా బ్రెగ్జిట్ అనుకూల, వోక్ వ్యతిరేక వైఖరి తీసుకున్నారు..ఓపినియం బ్యాలెట్‌కు అనుగుణంగా కన్జర్వేటివ్ గెట్ టుగెదర్ మెంబర్‌లలో చీఫ్‌గా ఉండటానికి సునక్ చాలా చేసి బ్రిటన్ కు అన్యాయం చేశాడు. అయినప్పటికీ 51% మంది సభ్యులు తమకు అత్యంత ప్రజాదరణ పొందిన బోరిస్ జాన్సన్ ను గద్దెదించి విలన్ గా మారాడు. అలాంటి దేశద్రోహికి బ్రిటన్ ప్రధానిగా ఉండాలని కోరుకుంటున్నారా? ’ మరో విశ్లేషకుడు కామెంట్ చేశాడు.
ఇలా బ్రిటన్ కు చెందిన రాజకీయ విశ్లేషకులు, ఆ దేశ రాజకీయ నాయకులు ప్రధాని పదవికి పోటీపడుతున్న ముగ్గురు భారత సంతతి నేతలపై అప్పుడే కుట్రలకు తెరతీశారు. జాత్యహంకార దాడి చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భారతీయులకు బ్రిటన్ ప్రధాని పదవి దక్కకూడదని కుట్రలు చేస్తున్నారు. బ్రిటన్ నేతలు, రాజకీయ విశ్లేషకులు, మీడియా రిషి, ప్రీతి, సుయెల్లాలు ప్రధానులు కాకుండా ఈ ప్రచారాన్ని సోషల్ మీడియాలో.. మీడియాలో చేస్తున్నారు. మరి ఈ కుట్రలను మన భారతీయ సంతతి నేతలు ఛేదిస్తారా? ఏం చేస్తారన్నది వేచిచూడాలి.