Homeఎంటర్టైన్మెంట్Rana Talk Show: సమంత తో నాగ చైతన్య విడిపోవడానికి కారణం పిల్లలేనా..? రానా కొత్త...

Rana Talk Show: సమంత తో నాగ చైతన్య విడిపోవడానికి కారణం పిల్లలేనా..? రానా కొత్త టాక్ షోలో నాగచైతన్య కామెంట్స్ వైరల్!

Rana Talk Show: సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసిన నాగ చైతన్య పేరు ఎలా ట్రెండ్ అవుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. త్వరలోనే ఆయన శోభిత దూళిపాళ్ల ని పెళ్లి చేసుకోబోతుండడమే అందుకు కారణం. ఆగస్టు లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, వచ్చే నెల నాల్గవ తేదీన అన్నపూర్ణ స్టూడియోస్ లో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనుంది అక్కినేని ఫ్యామిలీ. ఇదంతా పక్కన పెడితే ఈ నెల 23 వ తారీఖు నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో దగ్గుబాటి రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ది రానా దగ్గుబాటి షో’ అనే టాక్ షో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా కాసేపటి క్రితమే ఈ షో కి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ లో రానా ప్రముఖ టాలీవుడ్ సెలెబ్రిటీలు రాజమౌళి, నాగ చైతన్య, రిషబ్ శెట్టి, సిద్దు జొన్నలగడ్డ, శ్రీలీల, మిషిక బజాజ్ వంటి వారితో చిట్ చాట్ చేసిన దృశ్యాలు ఉన్నాయి.

ఇందులో నాగ చైతన్య మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. రానా నాగ చైతన్య ని ఒక ప్రశ్న అడుగుతూ ‘నీ కుటుంబం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు’ అని అడగగా, దానికి నాగ చైతన్య సమాధానం ఇస్తూ ‘సంతోషం గా వివాహం చేసుకొని. పిల్లాపాపలతో నిండు నూరేళ్లు జీవించాలి’ అని అన్నాడు. ఈ అంశంపైనే ఇప్పుడు సోషల్ మీడియా లో చర్చ జరుగుతుంది. నాగ చైతన్య కి పిల్లలు అంటే చాలా ఇష్టమని, అందుకే సమంత తో విడిపోవాల్సి వచ్చిందని అంటున్నారు నెటిజెన్స్. నాగ చైతన్య పిల్లలు కావాలని సమంత ని కోరడం, సమంత తనకి ఉన్నటువంటి పీక్ కెరీర్ ని వదులుకోవడం ఇష్టం లేక నో చెప్పడం, ఈ విషయం లో ఇద్దరి మధ్య విబేధాలు ఏర్పడడంతో విడిపోవాల్సి వచ్చిందని డాట్స్ కనెక్ట్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు నెటిజెన్స్. వాళ్ళు విడిపోవడానికి కారణాన్ని అటు నాగ చైతన్య, ఇటు సమంత ఇద్దరు కూడా చెప్పరు. కాబట్టి అప్పటి వరకు ఇలాంటి కథనాలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతూనే ఉంటాయి.

ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన ‘తండేల్’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 వ తారీఖున విడుదల కాబోతుంది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి అల్లు అరవింద్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ సినిమా తర్వాత ఆయన విక్రమ్ కె కుమార్ తో ఒక సినిమా చేయనున్నాడు. అదే విధంగా దూత వెబ్ సిరీస్ సీక్వెల్ లో కూడా నాగ చైతన్య నటించబోతున్నట్టు సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular