Rishi Sunak: బ్రిటన్ లో మన భారతీయ సంతతికి చెందిన రుషి సునాక్ ప్రధాని అవుతారని అందరు ఆశపడినా అవి నెరవేరే సూచనలు కనిపించడం లేదు. నిన్నటి దాకా ఉన్న పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. రుషికే సభ్యుల మద్దతు ఉందని ప్రచారం సాగినా తరువాత పరిస్థితిలో మార్పు వచ్చింది. దీంతో రుషి ఆశలు నెరవేరేలా కనిపించడం లేదని తెలుస్తోంది. బ్రిటన్ లోని యూగోవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో రుషికి చుక్కెదురనే విషయం స్పష్టమవుతోంది. దీంతో ఇప్పటివరకు అడుగు దూరంలో ఉన్న సునాక్ పరిస్థితి గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి టిజ్ ట్రస్ కే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నట్లు సర్వే సూచిస్తోంది.

రుషి, ట్రస్ లలో ఎవరికి విజయావకాశాలు ఉన్నాయనే దానిపై యూగోవ్ సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 62 శాతం మంది లిజ్ ట్రస్ కే మద్దతుగా నిలిచారు. 38 శాతం మంది మాత్రం రుషికి జై కొట్టారు. దీంతో లిజ్ ట్రస్ కే విజయావకాశాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. గత వారం 19 పాయింట్లు సాధించిన లిజ్ ట్రస్ ప్రస్తుతం 24 పాయింట్లు సాధించడం విశేషం. దీంతో రుషి ఆశలు గల్లంతయినట్లేనని తెలుస్తోంది. ఎంపీల్లో ఎక్కువ మంది రిషికే మద్దతుగా నిలిచినా సభ్యుల్లో మాత్రం లిజ్ కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రుషి ప్రధాని కావాలనే కల కలగానే మిగులుతోందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Jagan To Meet Party Workers: వైసీపీలో జగన్ కు ఇన్నాళ్లకు గుర్తొచ్చిందా?
ఈ నేపథ్యంలో ఆగస్టు 4 నుంచి 5 వరకు ఎన్నికలు జరగనున్నాయి. ఎక్కువ మంది సభ్యులు మాత్రం ట్రస్ కే మద్దతు తెలుపుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. దీంతో బెటింగ్ రాయుళ్లు కూడా ట్రస్ కే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో రుషి ప్రధాని అవుతారని అందరు ఆశించారు కానీ విధి మాత్రం రుషికి మొండిచేయి చూపిస్తోంది. దీంతో బ్రిటన్ లో మనవాడు ప్రధాని అవుతారనే వార్త అందరిలో సంతోషం నింపినా చివరకు అది నిరాశగానే మిగిలిపోతోంది.

రిషి సునాక్ ప్రధాని పీఠంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అవి తీరేలా కనిపించడం లేదు. ఇన్నాళ్లు రుషి ప్రధాని అవుతారనే ఆశలు ఉన్నప్పటికి యూగోవ్ వెల్లడించిన సర్వేతో అంచనాలు తలకిందులవుతున్నాయి. లిజ్ కే ఎక్కువ మంది ఓటు వేస్తారనే తెలుస్తోంది. ఈ క్రమంలో రుషి కి ఎక్కువ మంది ఓటువేయడం లేదనే సర్వే చెబుతోంది. కానీ మొత్తానికి అక్కడి సభ్యుల్లో మంచి ఆదరణ మాత్రం సంపాదించుకున్నారు. ప్రధాని అయినా కాకపోయినా మనవాడికి పరపతి మాత్రం మెండుగానే ఉన్నట్లు సమాచారం.
Also Read:Telangana Rains: జనానికి నరకయతనే.. తెలంగాణలో మళ్లీ వానలు.. మరో ఐదు రోజులు.. రెడ్ అలెర్ట్
[…] […]