AP Debts: ఏపీ అప్పలుకుప్పగా మారిపోయింది. ఆర్థిక దివాళా దిశగా ప్రయాణిస్తోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోంది. భవిష్యత్ ఆదాయానికి కుదువపెట్టి మరీ రుణాలు పొందుతోంది. అడ్డూఅదుపూ లేకుండా వ్యవహరిస్తోంది. అసలే ఏ బ్యాంకు నుంచి ఎంత అప్పులు తెచ్చారు? ఏం లెక్క చెప్పారు? ఏం తాకట్టు పెట్టారో కూడా స్పష్టత లేదు. అప్పు ఇచ్చిన వారు ఏ ప్రాతిపదికన ఇచ్చారో కూడా తెలియడం లేదు. చేసిన అప్పులను ఏపీ ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. ఎప్పుడైనా విమర్శలు వచ్చినప్పుడు అప్పులా..మేమా ? అంటూ ఏం తెలియనట్టుగా వ్యవహరిస్తోంది. అసలు మేం చేసింది ఒక అప్పేనా అని కూడా తిరిగి ప్రశ్నిస్తోంది. అటు అప్పులు ఇచ్చిన బ్యాంకులు కూడా గోప్యత పాటిస్తున్నాయి. సామాన్యుడి రుణ గడువు ఒక రోజు దాటితే నానా యాగి చేసే బ్యాంకులు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో బయటకు చెప్పకపోవడం చాలా అన్యాయం. అయితే ఈ పరిణామాలు మున్ముందు జఠిలమయ్యే అవకాశముందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలితో బ్యాంకులు కూడా బదనమయ్యే అవకాశముందంటున్నారు. అయితే చేసిన అప్పులను బయటకు చెప్పకుండా ఏపీ ప్రభుత్వం మేనేజ్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గోల్ మాల్ వ్యవహారం మున్ముందు పెద్ద ప్రకంపనలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంతకాలం పెద్దగా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఏపీ చర్యలపై సీరియస్ అవుతోంది. దీంతొ మొత్తం లోగుట్టు బయటపడే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మారిన పరిస్థితులు ఏపీ ప్రభుత్వానికి కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆర్థిక ప్రతికూల పరిస్థితులతో రాజకీయంగా ఏపీ సీఎం జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ పరిస్థితి శ్రీలంక మాదిరిగా ఉందన్న టాక్ విస్తరిస్తోంది.

కేంద్రం కన్నెర్ర…
శ్రీలంక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రతమత్తమైంది. ఇటీవల అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఏపీతో సహా పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చింది. ఏపీ, బిహార్, హరియాణా, ఝార్కండ్, కేరళ, మధ్యప్రదేశ్,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులు చేస్తుండడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు.
Also Read: Rishi Sunak: రిషి సునాక్ కు షాక్.. బ్రిటన్ ప్రధాని రేసులో భారతీయుడి కల చెదిరినట్లేనా?
ఏపీలో రుణాలు జీఎస్ డీపీలో 32 శాతానికి చేరినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం25 శాతానికి చేరినట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై టీఆర్ఎస్, వైసీపీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కానీ దీనిపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించారు. రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని చెప్పి అప్రమత్తం చేశామే తప్ప..ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. అయితే కేంద్రం వెల్లడించిన జాబితాలో బీజేపీయేతర పార్టీలు అధికారమున్న రాష్ట్రాలే ఉండడం విశేషం. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అసలు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని.. వాటి మాటేమిటని నిలదీస్తున్నారు. కానీ తాము తప్పు చేసినట్టు మాత్రం ఒప్పుకోవడం లేదు. తాము ఎంత అప్పులు చేశామో కూడా బయటకు వెల్లడించడానికి ఇష్టపడడం లేదు.

అడ్డగోలుగా రుణాలు..
అయితే అప్పులు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు నివ్వెరపరుస్తున్నాయి. అప్పుల కోసం ఏకంగా ప్రభుత్వం నిపుణులను కన్సల్టెంట్లుగా పెట్టుకుంది. మేథావులైన అధికారులను కాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా పనిచేసిన వారిని సలహదారులుగా నియమించుకుంటోంది. వారైతే తమ పరపతిని, లూప్ హోల్స్ ను వినియోగించుకొని అప్పులు పుట్టిస్తారని ఆ బాధ్యతను వారికి అప్పగిస్తోంది. అయితే కమీషన్లకు కక్కుర్తిపడిన కొందరు బ్యాంకు అధికారులు కనీస నిబంధనలు పాటించకుండా ఏపీ ప్రభుత్వానికి అప్పులిస్తున్నారు. మున్ముందు నిర్ణయాలు బ్యాంకులకు రివర్ష్ అయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ప్రభుత్వం కుదువ పెట్టింది ఏంటి? తిరిగి వసూలు అయ్యే అవకాశం ఉందా? లేదా? అని నిర్థారించకుండానే బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి. అయితే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం కూడా ఈ విషయంలో తప్పుడు విధానాలను ఎంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. మున్ముందు దీనికి మూల్యం తప్పదు.
Also Read:KTR Birthday Song 2022: కేటీఆర్ బర్త్ డే వీడియో.. సోషల్ మీడియాలో వైరల్
[…] […]