Homeఆంధ్రప్రదేశ్‌సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ!

సెప్టెంబర్ 1 నుంచి బియ్యం డోర్ డెలివరీ!

ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో బియ్యం డోర్ డెలివరీ ని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టారు. ఈ ప్రాజెక్టు ఆ జిల్లాలో విజయం సాధించడంతో రాష్ట్రం మొత్తం డోర్ డెలివరీ ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారు. సెప్టెంబరు 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటికే డోర్‌ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. అదే రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకాన్ని అమల్లోకి తీసుకు రావాలని ఆయన అన్నారు. పౌరసరఫాల శాక సమీక్షలో ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు.

ఎన్నికల హామీల్లో భాగంగా నాణ్యమైన, తినగలిగే బియ్యాన్ని డోర్‌ డెలివరీ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. అప్పుడిచ్చిన మాటను సెప్టెంబర్ 1 నుంచి అమలుపరిచే విధంగా జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version