https://oktelugu.com/

డిసెంబర్ చివరి వరకు వర్క్‌ ఫ్రం హోం..!

లాక్ డౌన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటి తదితర రంగాలలో పెద్ద ఎత్తున ప్రారంభించిన వర్క్‌ ఫ్రం హోం లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ చివరి వరకు అందుకు కంపెనీలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే కంపెనీలలోనే పనిచేయించుకోవాల్సి వచ్చిన పూర్తి సిబ్బందితో చేయించుకోనే అవకాశాలు కనబడటం లేదు. సంగం మందిని ఆఫీస్ కు రమ్మని, మిగిలిన వారితో ఇంటినుండి పనిచేయించుకొనే ఏర్పాట్లు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 11:09 am
    Follow us on


    లాక్ డౌన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఐటి తదితర రంగాలలో పెద్ద ఎత్తున ప్రారంభించిన వర్క్‌ ఫ్రం హోం లాక్ డౌన్ పూర్తయిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ చివరి వరకు అందుకు కంపెనీలకు అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు.

    లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే కంపెనీలలోనే పనిచేయించుకోవాల్సి వచ్చిన పూర్తి సిబ్బందితో చేయించుకోనే అవకాశాలు కనబడటం లేదు. సంగం మందిని ఆఫీస్ కు రమ్మని, మిగిలిన వారితో ఇంటినుండి పనిచేయించుకొనే ఏర్పాట్లు జరిపే ఆలోచనలు చేస్తున్నారు.

    బ్రాండ్ విశాఖ: జగన్ కు లాభమా? నష్టమా?

    ఈ పద్దతిలో ఒక వారం ఇంటి నుండి, మరో వారం ఆఫీస్ నుండి వంతుల వారీగా పనిచేయించుకొనే ఆలోచనలు సాగుతున్నాయి. సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ కూడా ఇప్పటికే ఈ పద్ధతి అనుసరిస్తున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇప్పటికే ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం కల్పించిన విషయం తెలిసిందే.

    ఈ సంస్థతో పాటు మరో ప్రముఖ సెర్చ్‌ సంస్థ గూగుల్‌ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ప్రముఖ కంపెనీలన్నీ ఈ ఏడాది చివరి వరకూ వర్క్‌ ఫ్రం హోంకే మొగ్గు చూపుతున్నాయి.

    భారత్ లో కూడా ప్రముఖ నగరాలైన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైతో పాటు ముంబయి, ఢిల్లీలలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నగరాల్లో ఇప్పటికే చాలా సంస్థలు తమ ఉద్యోగులతో ఇళ్లలో నుంచే పని చేయించుకుంటున్నాయి.

    ఆంధ్రా న్యూస్ ఛానెళ్ల పని ఖతమేనా?

    అయితే లాక్‌డౌన్‌ ఎత్తేయగానే ఉద్యోగులందరూ బయటికొచ్చేస్తే పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు ప్రముఖులు, అధికారులు, కంపెనీల యజమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. మరికొన్నాళ్ల పాటు వర్క్‌ ఫ్రం హోం మంచిదని పలువురు వైద్యాధికారులు సైతం చెబుతున్నారు.

    ప్రస్తుతం లాక్ డౌన్ లో కేంద్రం సడలింపులు ఇచ్చినప్పటికీ పలు కర్మాగారాలలో 30 శాతం మించి హాజరు కాకుండా చూసుకోవాలని నిబంధనలు పెట్టడం తెలిసిందే.

    ఈ నెలాఖరు నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనగలవని ఒక వంక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా, ప్రస్తుతం దేశంలో కేసుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉండడంతో ఆ తర్వాత పరిస్థితుల గురించి ఇప్పుడే ఒక అంచనాకు రాలేక పోతున్నారు. దానితో వర్క్ ఫ్రం హోం మరి కొంత కాలం తప్పని పరిస్థితులు స్పష్టం అవుతున్నాయి.