ప్రముఖ విలన్ కమ్ క్యారెక్టర్ కమ్ కమెడియన్ జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జేపీ నేడు స్వర్గస్తులయ్యారు. నేటి ఉదయం ఆయన బాతుర్రూంలో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే జేపీ మృతిచెందారు. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఓ ప్రముఖ నటుడిని కోల్పోయింది. ఆయన అకాల మృతిపై చిత్రసీమలోని ప్రముఖులంతా సంతాపం వ్యక్తం చేశారు.
Also Read: జేపీ మృతి తీరని లోటు.. ప్రముఖుల ట్వీట్లు
తాజాగా దేశ ప్రధాని మోదీ సైతం జయప్రకాశ్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమస్యలపై ప్రస్తావిస్తుంటారు. నేడు జయప్రకాశ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న్ ప్రధాని మోదీ తెలుగులో ఆయనకు నివాళి ఘటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రధాని తెలుగులో ట్వీట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.
‘జయ ప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు.. తన దీర్ఘకాల సినీయాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు.. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు.. వారి కుటుంబ సభ్యులకు.. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను.. ఓం శాంతి..’ అంటూ ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.
Also Read: రిటైర్ మెంట్ తీసుకున్న జేపీ ఎందుకు వెనక్కొచ్చాడు?
జయప్రకాశ్ మృతిపై టాలీవుడ్ పరిశ్రమ దిగ్భాంతిని వ్యక్తం చేసింది. ఉదయం నుంచి టాలీవుడ్లోని సెలబ్రెటీలంతా ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు స్టార్లు సోషల్ మీడియాలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, మాస్ మహారాజ్ రవితేజ, సుధీర్ బాబు, దర్శకుడు అనిల్ రావుపూడి, సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ ప్రణీత తదితరులు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.