RGV: ఆయన అంతే.. ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. మొన్నటికి మొన్న టికెట్ల రేట్ల విషయంలో మంత్రి పేర్నినానితో చర్చించి సంతృప్తి చెందినట్టు మాట్లాడిన వర్మ.. తెల్లారే ప్లేటు ఫిరాయించేశారు. వైసీపీ ప్రభుత్వం మీద విమర్శల బాణాలు కురిపిస్తున్నారు. ఇంతకు ఆయనెవరో ఇప్పటికే అర్థం అయి ఉంటుంది కదా. ఆయనేనండి రామ్ గోపాల్ వర్మ. టికెట్ల రేట్ల విషయంలో ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి తీవ్ర ఆసక్తి నెలకొంటోంది.
ఇక నేరుగా మంత్రి పేర్నినాని ఆఫీసుకు వెళ్లి ఆయన్ను కలిశారు. అనంతరం మీడియాతో బాగానే మాట్లాడారు. కానీ నిన్న ట్విట్టర్ లో వార్ షురూ చేశారు. సీన్ ఆర్ ఆర్ ఆర్ మూవీ టికెట్లను తీసుకు వచ్చారు. ఆ మూవీకి ముంబైలో రూ.2,200 ఉంటే.. ఏపీలో మాత్రం రూ.200 కూడా లేకపోవడాన్ని తప్పుబట్టారు. ఇక్కడ వర్మ లాజిక్ ఏంటంటే.. ప్రైవుటు వ్యక్తులు రూపొందించుకున్న ఉత్పత్తులకు ప్రభుత్వం రేటు నిర్ణయించడం కరెక్టు కాదని వాదిస్తున్నారు.
Also Read: థమన్ నెగిటివే పాన్ ఇండియా సినిమాలకు పాజిటివ్ !
మరో విషయం ఏంటంటే.. రాజమౌళి డైరెక్ట్ చేసిన రూ.500 కోట్ల ఆర్ ఆర్ ఆర్‌ను చిన్న సినిమాతో పోల్చడం తప్పు అంటున్నారు. ఆర్ ఆర్ఆర్‌కు చిన్న సినిమాలకు ఒకే రకమైన టికెట్లు అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒక రకమైన టికెట్లు ఉంటే.. ఏపీలో మరో రకమైన రేట్లు ఉండటం ఆర్టికల్ 14 ను ఉల్లంఘించినట్టే అవుతుందన్నారు. సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఇన్నేండ్ల తర్వాత ఎవరూ అడగకపోయినా ఎందుకు తెరమీకు తెస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఆర్జీవీ.
ఇక మరో విషయం ఏంటంటే.. ఈ విషయాన్ని జాతీయ మీడియాలో ఫోకస్ అయ్యేందుకు ముంబైలో ప్రెస్ మీట్ పెట్టాలంటూ తనను ఒత్తిడిచేస్తున్నారని వర్మ చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 19 ప్రకారం.. ఇలా ఒత్తిడి చేయడం అనేది భావవ్యక్తీకరణ హక్కును ఉల్లంఘించడమే అవుతుందటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే ఇలా సడెన్ గా వర్మ ఎందుకు ప్లేటు ఫిరాయించాడనేది అర్థం కావట్లేదు. కానీ సినీ ఇండస్ట్రీ గురించి మాత్రం తానొక్కడినైనా సరే అంటూ ముందుకు రావడం ఇక్కడ విశేషం. ఇన్ని రోజులు వైసీపీకి మద్దతు పలికిన వర్మ.. ఇప్పుడు సడెన్ గా విమర్శించడం మాత్రం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
Also Read: ఎయిర్ పోర్టుకు నీటి సరఫరా ఆపేసిన ఎమ్మెల్యే కొడుకు.. చుక్కలు చూస్తున్న అధికారులు