RGV and Perni Nani: ఆర్జీవీతో మంత్రి పేర్ని నాని భేటీ కాబోతున్నాడు. ఈనెల 10న సచివాలయంలో సమావేశమయ్యేందుకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్ మెంట్ అందింది. సినిమా టికెట్ల రేట్ల పై చర్చించాలని ఇటీవల ఆర్జీవీ రిక్వెస్ట్ చేయడం, ఈ మేరకు పేర్ని నాని కూడా అంగీకరించడం జరిగింది. కాగా తనను చర్చలకు ఆహ్వానించినందుకు ఆర్జీవీ ధన్యవాదాలు కూడా తెలుపుతూ ట్వీట్ పెట్టాడు.
సినిమా రంగం సమస్యల పై మాట్లాడుకుందామని ఏపీ ప్రభుత్వం పెద్దలను ఇండస్ట్రీ పెద్దలు సమయం అడిగారు. కానీ జగన్ సమయం ఇవ్వలేదు. ఓ దశలో సినీ పెద్దలు మంచు విష్ణు ద్వారా అప్రోచ్ కావాలని ప్లాన్ చేశారు. జగన్ ‘మా బావ’ అంటూ గొప్పలు పోయే విష్ణు, జగన్ ను ఈ విషయం పై సమయం అడిగితే.. జగన్ ఎప్పటిలాగే చిరునవ్వు నవ్వాడట. మొత్తానికి విష్ణుకి సమయం అయితే ఇవ్వలేదు.
దాంతో “మా” ప్రెసిడెంట్‌గా గెలిచాను, సినిమా రంగం తరుపున ప్రభుత్వ పెద్దలకు సన్మానం ప్రపోజల్ పెట్టి.. ఆ రకంగా ఓ వేదిక పై సినిమా పెద్దలను జగన్ ను కలపాలని మంచు విష్ణు ప్లాన్ చేశాడు. అయితే, సన్మానం ప్రపోజల్ కి ఇంత వరకూ అనుమతి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా టిక్కెట్ల అంశంపై చర్చిస్తా అంటూ ఆర్జీవీ ముందుకు రావడం, వర్మకు అపాయింట్ మెంట్ దొరకడం నిజంగా షాకింగే.
Also Read: హే జగన్.. నీ చుట్టూ డేంజరస్ పీపుల్.. జాగ్రత్తగా ఉండాలన్న వర్మ..
పైగా పేర్ని నాని – ఆర్జీవీల మధ్య ట్వీట్ వార్ కూడా గట్టిగా నడిచింది. అయినా ఆర్జీవీ జగన్ ప్రభుత్వం సమయం ఇచ్చింది. ఎక్కడో ఆర్జీవీ అంటే జగన్ కి ఇష్టం అట. గత ఎన్నికల ముందు చంద్రబాబు పై వ్యతిరేఖత పెరగడానికి ఆర్జీవీ కూడా ఒక కారణం. అందుకే, ఆర్జీవీని పిలిచి మాట్లాడమని ఆయనకు ఏమి కావాలో అడిగి ఇవ్వండి అంటూ జగన్ నుంచి ఆదేశాలు వచ్చాయట.
కానీ ఆర్జీవీ సమాధానాలు చెప్పలేని ప్రశ్నలను అడుగుతున్నాడు. పేర్ని నానిని అమరావతి సచివాలయంలో ఆర్జీవీ కలవబోతున్నాడు. టిక్కెట్ల అంశంపై వాదోపవాదాలకు దిగిన ఆర్జీవీ, చివరకు ఎలాంటి రిజల్ట్ తీసుకొస్తాడో చూడాలి. మరోపక్క ఆర్జీవీను ఇండస్ట్రీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆర్జీవీ మాత్రం ఇండస్ట్రీ గురించి ఫైట్ చేస్తున్నాడు.
Also Read: అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తిన ఆర్జీవి… వాళ్ళు చేయలేనిది నువ్వు చేశావంటూ ?