https://oktelugu.com/

జీహెచ్ఎంసీ మేయ‌ర్ పై రాంగోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. తాగేసి కుక్క‌పై ప్రేమా..? నేను కూడా కుక్కగా పుడతా!

వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మేయర్ షేర్ చేసిన వీడిపై మాట్లాడిన ఆర్జీవీ.. మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మేయర్ విజయలక్ష్మి లేటెస్ట్ గా ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో.. తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో తాను ఎడ‌మ చేత్తో తింటూ.. కుక్క‌కు మాత్రం కుడి చేత్తో […]

Written By:
  • Rocky
  • , Updated On : March 4, 2021 / 04:10 PM IST
    Follow us on


    వివాదాస్ప దర్శకుడు రాంగోపాల్ వర్మ చాలా కాలం తర్వాత వార్తల్లో నిలిచారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో మేయర్ షేర్ చేసిన వీడిపై మాట్లాడిన ఆర్జీవీ.. మరోసారి తనదైన శైలిలో స్పందించారు.

    మేయర్ విజయలక్ష్మి లేటెస్ట్ గా ట్విటర్ లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో.. తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపిస్తున్నారు. అయితే.. ఆ వీడియోలో తాను ఎడ‌మ చేత్తో తింటూ.. కుక్క‌కు మాత్రం కుడి చేత్తో తినిపిస్తున్నారు. ఈ విష‌యాన్ని హైలెట్ చేస్తూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు ఆర్జీవీ.

    Also Read: సంజయ్ నీకు దమ్ముందా.. కేటీఆర్ సంచలన సవాల్?

    ట్విట‌ర్ వేదిక‌గానే స్పందించిన రాంగోపాల్ వ‌ర్మ‌.. ‘‘సెల్ఫ్ లెస్ లవ్ కు ఇది నిదర్శనం. హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కుడి చేతితో కుక్కకి తినిపిస్తూ.. తాను మాత్రం ఎడ‌మ చేతితో తింటోంది. ఆమెను ఇంట‌ర్నేష‌న‌ల్ మేయ‌ర్ ను చేయాలి’’ అంటూ దండం పెట్టేశాడు.

    Also Read: కేసీఆర్‌‌ను వెంటాడే నీడ.. ఇలా షాకిచ్చాడేంటి?

    ఈ టాపిక్ మొత్తం మూడు ట్వీట్లు చేశాడు ఆర్జీవీ. రెండో ట్వీట్లో.. ‘‘విజయలక్ష్మి తాగి ఇలా కుక్కపై ప్రేమ చూపిస్తున్నారా? లేక కుక్కే తాగిందా? అని ఆశ్చ‌ర్యంగా ఉంది. ఏదేమైనా ఆమె ప్ర‌జ‌ల‌ను కూడా ఇలాగే ప్రేమిస్తే.. నాపై కూడా ఇలాంటి ప్రేమ‌ను కురిపిస్తానంటే.. వ‌చ్చే జ‌న్మ‌లో కుక్క‌గా పుట్టాల‌ని ప్రార్థిస్తాను’’ అని ట్వీట్ చేశాడు ఆర్జీవీ.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక, ఆఖరి ట్వీట్లో.. కుక్కపై ఆమె చూపుతున్న ప్రేమను చూసి అందరూ అసూయ పడతారని రాశారు. ‘‘ఆమె కుటుంబ సభ్యులు.. పార్టీ మెంబర్స్.. చివరకు కేటీఆర్, కేసీఆర్ కూడా ఖచ్చితంగా కుక్కని చూసి జెలసీ ఫీలవుతారు’’ అని కామెంట్ చేశారు ఆర్జీవీ. ఈ మూడు ట్వీట్లకూ మేయర్ వీడియోను జత చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో మేయర్ వీడియో, రాంగోపాల్ వర్మ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.