హోమ్లీ బ్యూటీకి ఫుల్ డిమాండ్.. కొత్తగా రెండు యాడ్స్ !

ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ ‘మీనా’కి ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 40 ప్లస్ ఏజ్ లో కూడా హీరోయిన్ గానే నటిస్తోంది. ‘దృశ్యం 2’ సినిమా సక్సెస్ పుణ్యమా అని మీనాకి ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. నిజానికి ‘దృశ్యం 2’లో మోహన్ లాల్ భార్యగా ఇద్దరు ఎదిగొచ్చిన కూతుళ్ళకు తల్లిగా నటించినా.. మీనాకి మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ పడింది. దాంతో ఆమె ‘దృశ్యం […]

Written By: admin, Updated On : March 4, 2021 5:05 pm
Follow us on


ఒకప్పటి హోమ్లీ హీరోయిన్ గా సీనియర్ బ్యూటీ ‘మీనా’కి ఇప్పటికీ యూత్ లో మంచి క్రేజ్ ఉంది. 40 ప్లస్ ఏజ్ లో కూడా హీరోయిన్ గానే నటిస్తోంది. ‘దృశ్యం 2’ సినిమా సక్సెస్ పుణ్యమా అని మీనాకి ఇప్పుడు మరింత డిమాండ్ పెరిగింది. నిజానికి ‘దృశ్యం 2’లో మోహన్ లాల్ భార్యగా ఇద్దరు ఎదిగొచ్చిన కూతుళ్ళకు తల్లిగా నటించినా.. మీనాకి మాత్రం ఆ సినిమాలో హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ పడింది. దాంతో ఆమె ‘దృశ్యం 2’ తెలుగు రీమేక్ లో కూడా నటించనుంది.

Also Read: ల‌వ‌ర్ బోయ్స్ కాదు.. యాక్ష‌న్ స్టార్స్‌.. యంగ్ హీరోస్ మేకోవ‌ర్ కేక‌!

ఏది ఏమైనా ప్రస్తుతం మోహన్ లాల్, వెంకటేష్, రజినీకాంత్ వంటి హీరోలకు హీరోయిన్ సమస్య అనేది ఆనవాయితీ అయిపొయింది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి దొరికిన మంచి ఆప్షన్ ‘మీనా’. 90లలో వారి సరసన హీరోయిన్ గా నటించి, ముందు జనరేషన్ కుర్రాళ్ల గుండెలను తన హ్యూజ్ గ్లామర్ తో ఉక్కిరిబిక్కిరి చేసింది. మళ్ళీ 20 ఏళ్ల తర్వాత కూడా వాళ్ళ సినిమాల్లో హీరోయిన్ గానే మీనా కనిపిస్తుండడం నిజంగా విశేషమే. కాకపోతే రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు కాదు అనుకోండి. కానీ, ఆ హీరోలకి మాత్రం హీరోయిన్ గానే నటిస్తోంది.

Also Read: సెట్స్ నుంచి రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ పిక్స్ లీక్‌.. మంటలు రేపుతున్న చిత్రాలు!

అందుకే మీనాకి ఈ మధ్య యాడ్స్ కూడా పెరిగాయి. లేటెస్ట్ గా ఆమె రెండు బ్రాండ్స్ ఒప్పుకొంది. మరి మిడిల్ ఏజ్ లో కూడా ఏ మాత్రం బిగువు తగ్గకుండా బాడీని మెయింటైన్ చేస్తోన్న ఈ భారీ ముదురు భామకు ఆ మాత్రం డిమాండ్ ఉండటం సహజమే అంటున్నారు నెటిజన్లు. అన్నట్లు మీనా ఓ వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. “కరోలిన్ కామాక్షి” పేరుతో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ లో ఒక సిబిఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. అలాగే కాస్త గ్లామర్ డోస్ కూడా ఈ సిరీస్ కోసం మీనా కురిపిస్తుండటంతో ఈ సిరీస్ పై ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్