
ఉత్తరాఖండ్ తదుపరి సీఎంగా భాజపా నేత పుష్కర్ సింగ్ ధామి పేరు ఖరారైంది. ఈ మేరకు శనివారం జరిగిన సమావేశంలో భాజపా శాసనసభాపక్ష నేతగా పుష్కర్ ను ఎన్నుకున్నారు. దీంతో రాష్ట్ర 10వ ముఖ్యమంత్రిగా పుష్కర్ త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి తీరథ్ సింగ్ రావత్ శుక్రవారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే.