https://oktelugu.com/

రేవంత్ ట్విస్ట్: హుజూరాబాద్ బరిలో ఇతడే!

కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేయడానికి రెడీ అయిన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో దుమారం రేపింది. కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కావడం.. కాంగ్రెస్ వేటు వేయడం.. కౌశిక్ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు వేడెక్కాయి. అయితే బలమైన కౌశిక్ రెడ్డి రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ తరుఫున పోటీచేయడానికి బలమైన నేతల కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 13, 2021 / 03:34 PM IST
    Follow us on

    కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఉండి టీఆర్ఎస్ టికెట్ పై పోటీచేయడానికి రెడీ అయిన పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో దుమారం రేపింది. కౌశిక్ రెడ్డి ఆడియో లీక్ కావడం.. కాంగ్రెస్ వేటు వేయడం.. కౌశిక్ రెడ్డి రాజీనామాతో రాజకీయాలు వేడెక్కాయి.

    అయితే బలమైన కౌశిక్ రెడ్డి రాజీనామా తర్వాత హుజూరాబాద్ లో కాంగ్రెస్ తరుఫున పోటీచేయడానికి బలమైన నేతల కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కరీంనగర్ కు చెందిన పొన్నం ప్రభాకర్ ను రంగంలోకి దింపాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    ఈటల రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనుకున్న కౌశిక్ రెడ్డి కాస్త సొంత పార్టీకి ఝలక్ ఇవ్వడంతో ఇప్పుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెరపైకి వచ్చాడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల హడావుడి మొదలైన తర్వాత పొన్నం సొంతంగా ప్రచారం మొదలుపెట్టాడు.

    అయితే అప్పటివరకు కాంగ్రెస్ లోనే ఉన్న కౌశిక్ రెడ్డి వర్గం పొన్నంను అడ్డుకుంది. అలా మొదలైన గొడవలు చివరకు కౌశిక్ రెడ్డి బహిష్కరణ దాకా వెళ్లాయి.

    అయితే పొన్నం ప్రభాకర్ నే హుజూరాబాద్ బరిలో నిలపాలని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించకున్నా.. పొన్నం సైలెంట్ గా ప్రచారంలో మునిగిపోయారు.

    చివరి నిమిషంలో అనూహ్య నిర్ణయాలు లేకపోతే పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నుంచి హుజూరాబాద్ లో నిలవడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది.