సెటైర్: కేసీఆర్, మోడీ.. ఓ రేవంత్

ఎంతో మంది నేతలున్నా తెలుగు రాష్ట్రాల్లో మాటల మరాఠీలు కొందరే ఉంటారు. కేసీఆర్ అచ్చ తెలంగాణ యాసలో బూతులు తిట్టినా చెవులకు ఎంతో వినసొంపుగానే ఉంటాయి.. ఇక ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ తెలుగులో ఏం మాట్లాడినా ఇట్టే నవ్వు వస్తుంది. ఆయన భాష, గ్రాంథికం, వ్యాకరణం న‘బూతే’ నభవిష్యతి..  ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ‘తెలియజేసుకుంటున్నాను’ అని పాడిందే పాడినా రికార్డింగ్ ఆడియోలా వినిపిస్తుంది. ఇక జగన్ సంగతి చెప్పక్కర్లేదు.. ధీర్ఘాలు తీస్తూ […]

Written By: NARESH, Updated On : April 23, 2021 9:16 pm
Follow us on

ఎంతో మంది నేతలున్నా తెలుగు రాష్ట్రాల్లో మాటల మరాఠీలు కొందరే ఉంటారు. కేసీఆర్ అచ్చ తెలంగాణ యాసలో బూతులు తిట్టినా చెవులకు ఎంతో వినసొంపుగానే ఉంటాయి.. ఇక ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ తెలుగులో ఏం మాట్లాడినా ఇట్టే నవ్వు వస్తుంది. ఆయన భాష, గ్రాంథికం, వ్యాకరణం న‘బూతే’ నభవిష్యతి..  ఆయన తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ‘తెలియజేసుకుంటున్నాను’ అని పాడిందే పాడినా రికార్డింగ్ ఆడియోలా వినిపిస్తుంది.

ఇక జగన్ సంగతి చెప్పక్కర్లేదు.. ధీర్ఘాలు తీస్తూ ఆయన ప్రసంగం ‘ప్రతీ అక్కకు.. అన్నకు.. చెల్లెకు.. ’ ఇలా సాగుతూనే ఉంటుంది.. తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్, కేటీఆర్ అంతో ఇంతో భాష పటిమ ఉన్న నాయకులు. కేసీఆర్ తోపాటు కొడుకు కేటీఆర్, కూతురు కవితకు ఈ విద్య అబ్బింది. ఇక అల్లుడు హరీష్ రావు అయితే ఒక ఆకు ఎక్కువే చదివాడు.

అయితే ప్రత్యర్థుల్లోనూ ఈ ఘానాపాటిలున్నారు. ఆయనే రేవంత్ రెడ్డి. నిజానికి రేవంత్ రెడ్డిని సరిగ్గా వాడుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. కానీ సీనియర్ల అడ్డంకులు.. పార్టీలోని కుమ్ములాటల వల్ల రేవంత్ కు పీసీపీ పదవి రావడం లేదు. దాన్నుంచి తెలంగాణ సీఎం కావడం లేదు. అవినీతి మరకలున్నా.. కూడా ఈరోజుల్లో జైలుకు వెళ్లొచ్చిన జగన్ నే సీఎం చేశారు ప్రజలు.. రేవంత్ ను చేయకుండా ఉంటారా?

పైగా ప్రజల్లో తిరిగి ప్రజాభిమానం గల ఫైర్ బ్రాండ్ రేవంత్. తెలంగాణ సహా తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కు సరితూగగల మాటలు, చేష్టలు.. రాజకీయం చేయడంలో రేవంత్ ముందుంటారు. తాజాగా ఆయన కేసీఆర్, మోడీ, ఈటల రాజేందర్ పై హాట్ కామెంట్స్ చేశారు. కరోనా విషయంలో హైకోర్టు తిట్లకు సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్ లో దూకాలని.. సుప్రీం తిట్టిన తిట్లకు మోడీ ఎర్రకోట మీద నుంచి దూకాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలని రేవంత్ రెడ్డి హితవు పలికారు.. ఆయన శాఖలోని అధికారులే ఈటలను గౌరవించడం లేదని రేవంత్ ఎద్దేవా చేశారు.

ఇలా సందర్భానికి తగ్గట్టు పంచులు పేల్చడంలో రేవంత్ రెడ్డి ముందుంటారు. ఆయన పంచులకు మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వదు కానీ.. ఇస్తే మాత్రం కథ వేరేగుంటది.. రేవంత్ ప్రాసల ప్రవాహంలో నేతలంతా కొట్టుకోవాల్సిందే..

-నరేశ్