https://oktelugu.com/

Revanth Reddy: రేవంత్ లాబీయింగ్ పనిచేసిందే.. కాంగ్రెస్ లోకి డీఎస్.. వ్యతిరేకిస్తున్న సీనియర్లు

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. నేతల రాకతో పార్టీ పూర్వవైభవం సాధిస్తుందనే ఆశాభావం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని వీడిన సీనియర్ నేతలను బుజ్జగించి పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతోనే గతంలో పార్టీ వీడిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 17, 2022 / 09:14 AM IST

    Revanth Reddy

    Follow us on

    Revanth Reddy: కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరుగుతోంది. నేతల రాకతో పార్టీ పూర్వవైభవం సాధిస్తుందనే ఆశాభావం కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి నియామకం అయ్యాక పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీని నేతలను తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని వీడిన సీనియర్ నేతలను బుజ్జగించి పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతోనే గతంలో పార్టీ వీడిన సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు రేవంత్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అధిష్టానం ఆయన చేరికకు మార్గం సుగమం చేసింది. దీంతో ఈనెల 24న ఆయన చేరికకు ముహూర్తం కూడా ఖరారైందని తెలుస్తోంది.

    Revanth Reddy

    మరోవైపు డీఎస్ చేరికను కొందరు ఆక్షేపిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని వీడిన వారిని తిరిగి తీసుకొచ్చేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. పైగా డీఎస్ తో ఇప్పుడు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో ఆయన సేవలు చేయలేరనే వాదన వినిపిస్తోంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీనియర్ నేతల పునరాగమనానికే పెద్దపీట వేస్తున్నట్లు తెలుస్తోంది.

    Also Read: ప్రెషర్లకు విప్రో అదిరిపోయే శుభవార్త.. రూ.29,000 వేతనంతో ఉద్యోగ ఖాళీలు?

    ఈ నేపథ్యంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదనే విమర్శలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. పార్టీని వదిలి వెళ్లిన వారిని మళ్లీ తీసుకురావడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధినే కేసీఆర్ తో పడకనే కాంగ్రెస్ లోకి రావడానికి మొగ్గుచూపుతున్నారని ప్రచారం సాగుతోంది. దీంతో డీఎస్ రాక సందర్భంగా పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కు ప్రస్తుత దుర్భర పరిస్థితుల్లో సీనియర్ల కంటే యువ నేతలే మేలనే అభిప్రాయం నేతల్లో వస్తోంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నేతల అవసరం ఏర్పడింది. కానీ సీనియర్లను తీసుకొస్తే వారు ఏం పనులు చేస్తారని విమర్శిస్తున్నారు. ఒక చోట కూర్చుంటే పనులు కావని రాష్ర్టమంతా పర్యటించి పార్టీని చక్కదిద్వాల్సిన వారిని కాదని వృద్ధ నేతలతో ఏం ప్రయోజనం అని నిట్టూరుస్తున్నారు.

    కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో చిక్కుకున్న పోకచెక్కలా మారింది. ఒక వైపు సీనియర్ల పక్షపాతం, మరో వైపు రేవంత్ రెడ్డి ఒంటెత్తు పోకడ తదితర విషయాలతో పార్టీ భవితవ్యం గందరగోళంలో పడుతోంది. ఒకరు వద్దంటే మరొకరు కావాలనే సంస్కృతి పార్టీని వీడటం లేదు. దీంతో పార్టీ రాబోయే ఎన్నికల్లో కూడా గట్టెక్కే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఈ క్రమంలో పార్టీకి యువరక్తం అవసరం ఉందని తెలుసుకుని యువతను ప్రోత్సహించి పార్టీకి జవసత్వాలు నింపాలని నేతలు కోరుతున్నారు.

    Also Read:  కరోనా పాజిటివ్ వచ్చిందా.. త్వరగా కోలుకోవాలంటే తీసుకోవాల్సిన ఆహారాలివే?

    Tags