https://oktelugu.com/

Sbi Alert:  ఎస్బీఐ కస్టమర్లకు షాకింగ్ న్యూస్.. అలా చేయకపోతే అకౌంట్ క్లోజ్!

Sbi Alert:  దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐకు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంకు తాజాగా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఈ సంస్థ సూచిస్తోంది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ ను లింక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. మొదట పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 17, 2022 9:23 am
    Follow us on

    Sbi Alert:  దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంగా ఎస్బీఐకు పేరు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్యాంకు తాజాగా కస్టమర్లకు అదిరిపోయే తీపికబురు అందించింది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డును కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఈ సంస్థ సూచిస్తోంది. బ్యాంక్ అకౌంట్ కు పాన్ కార్డ్ ను లింక్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. మొదట పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎస్బీఐ లావాదేవీలు చేయవచ్చు.

    ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకోని పక్షంలో పాన్ కార్డ్ ఇన్ యాక్టివ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. పాన్ కార్డు ఇన్ యాక్టివ్ అయితే ఇన్ యాక్టివ్ అయిన కార్డు ద్వారా భవిష్యత్తులో ఎలాంటి లావాదేవీలు చేయడం వీలు కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ సైతం పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలని ఇప్పటికే సూచనలు చేసిన విషయం తెలిసిందే.

    2022 సంవత్సరం మార్చి 31వ తేదీ పాన్ కార్డును ఆధార్ తో లింక్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఆన్ లైన్ లో కూడా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. www.incometax.gov.in వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డుతో పాన్ కార్డును లింక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ లో ఎడమవైపు లింక్ ఆధార్ అనే ఆప్షన్ ఉంటుంది.

    ఆ అప్షన్ ను క్లిక్ చేసి పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా ఆధార్ తో పాన్ కార్డును లింక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. లింక్ చేసిన కొన్నిరోజుల తర్వాత ఆధార్ కార్డు పాన్ కార్డుతో లింక్ అవుతుంది.