https://oktelugu.com/

కేసీఆర్ ను తిట్టి.. తాను అదే పని చేస్తున్న రేవంత్..!

సినీ నటులకు, రాజకీయనాయకులు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటారు. తమ పేరు కలిసి రాలేదని చాలామంది పేర్లు మార్చుకున్నవాళ్లని చూశాం. ఇక రాజకీయంలోకి వస్తే చాలా మంది రాజకీయ నాయకులు తమకు కలిసి రావాలని వాస్తును పాటించడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వాస్తు ప్రకారం సచివాలయం బాగా లేదని ఇప్పటి వరకు అందులో అడుగు కూడా పెట్టలేదు. ఏడేళ్లుగా కార్యకలాపాలన్నీ ప్రగతి భవన్లోనే నడిపిస్తున్నారు. అయితే […]

Written By: , Updated On : July 3, 2021 / 10:15 AM IST
Revanth Reddy
Follow us on

Revanth Reddy

సినీ నటులకు, రాజకీయనాయకులు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అలాగే సంఖ్యాశాస్త్రం ప్రకారంగా నడుచుకుంటారు. తమ పేరు కలిసి రాలేదని చాలామంది పేర్లు మార్చుకున్నవాళ్లని చూశాం. ఇక రాజకీయంలోకి వస్తే చాలా మంది రాజకీయ నాయకులు తమకు కలిసి రావాలని వాస్తును పాటించడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వాస్తు ప్రకారం సచివాలయం బాగా లేదని ఇప్పటి వరకు అందులో అడుగు కూడా పెట్టలేదు. ఏడేళ్లుగా కార్యకలాపాలన్నీ ప్రగతి భవన్లోనే నడిపిస్తున్నారు.

అయితే వాస్తు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు విమర్శలు చేశారు. అందులో రేవంత్ రెడ్డి కూడా సమయం దొరికినప్పుడల్లా కేసీఆర్ వాస్తు పై హేళన చేసేవారు. అయితే పీసీసీ అధ్యక్ష పదవి రావడంతో రేవంత్ రెడ్డి కూడా వాస్తు ను నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ స్టేట్ భవన్ అయిన గాంధీ భవన్లో కొన్ని మార్పులు చేస్తున్నారు. గాంధీ భవన్లో వాస్తు దోశంతోనే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు రేవంత్ తో చెప్పారట.

దీంతో ఆయన తూర్పు వైపు కొత్తగా ద్వారాన్ని ఏర్పాటు చేయిస్తున్నారు. ఇక భవన్లో ప్రచార సామగ్రి అనే ఓ గది ఉండేది. అందులోని సామగ్రినంతా తీసేయించారు. సెక్యూరిటీ గార్డు గదిని కూడా తొలగించేశారు. ఈ పనులన్నీ రేవంత్ రెడ్డి అనుచరులే దగ్గరుండి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి తెలియకుండా ఎవరూ ఈ పని చేయరు. ఆయన ఆదేశాలతోనే గాంధీ భవన్ మార్పులు చేస్తున్నారని అంటున్నారు.

అయితే ఇన్నాళ్లు కేసీఆర్ పై వాస్తు పిచ్చి అని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన గాంధీ భవన్ ను వాస్తు పేరిట మార్పులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నత పదవి వచ్చే సరికి ఎవరైనా సరే ఇలాంటివి నమ్మక తప్పదని అంటున్నారు. 7వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారు. ఈలోగా పనులు పూర్తి కావాలని రేవంత్ రెడ్డి అనుచరులు పగలు,రాత్రి నిద్రహారాలు మాని మార్పు చేయిస్తున్నారట.