
కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. 1,388 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఎండీఎల్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ లో ఏసీ మెకానిక్, కంప్రెషర్ అటెండెంట్, చిప్పర్ గ్రైండర్, కాంపోసిట్ వెల్డర్, జూనియర్ డ్రాట్స్‌మ్యాన్, ఫిట్టర్ ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తితో పాటు అర్హత ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://mazagondock.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా కనీసం 8 నుంచి 10వ తరగతి చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అంశంలో సర్టిఫికెట్ ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.
18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. అర్హతను బట్టి ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతీపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై నెల 4వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.