Mohan Babu Political Re-Entry: తెలుగుదేశం పార్టీలో సినీనటుడు మోహన్ బాబు సుదీర్ఘ కాలం సేవలందించారు. ఎన్టీఆర్ హయాంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచారు. అందుకు ప్రతిఫలంగా అన్నగారు ఆయనను రాజ్యసభ సభ్యుడిగా చేశారు. దీంతో మోహన్ బాబు టీడీపీలో అప్పుడు ఓ వెలుగు వెలిగారు. కానీ చంద్రబాబు సమయంలో మాత్రం పార్టీకి దూరంగా ఉన్నారు. టీడీపీకి ఆయనకు దూరం పెరిగింది. ప్రస్తుతం టీడీపీతో జంట కట్టేందుకే మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకు కొన్ని సంఘటనలు కూడా నిరూపిస్తున్నాయి. ఆయన చిత్తూరు నుంచి పోటీలో ఉంటారనే రాజకీయ వర్గాల సమాచారం. మోహన్ బాబు పార్టీలో చేరితే మరింత బలం పెరుగుతుందని అందరు అంచనా వేస్తున్నారు.

వైసీపీకి ప్రచారం చేసి చాలా మంది చేయి కాల్చుకున్నారు. అందులో మోహన్ బాబు ఒకరు. దీంతోనే ఆయన టీడీపీతో అంటకాగేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మోహన్ బాబు టీడీపీలో రంగప్రవేశం చేస్తారనే విషయాన్ని ప్రముఖ రాజకీయ వేత్త గోనె ప్రకాశ్ రావు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనంగా మారింది. టీడీపీలో మారిన సమీకరణల నేపథ్యంలో కొంత కాలం టీడీపీకి దూరంగా ఉన్నా మళ్లీ అదే గూటికి చేరాలని భావిస్తున్నారు. ఇక రాజకీయ ఎంట్రీ మిగిలి ఉంది. అన్ని విషయాలు ఇప్పటికే చర్చించినట్లు పార్టీల వర్గాల సమాచారం.
తిరుపతి సమీపంలో కొత్తగా నిర్మించిన సాయిబాబా దేవాలయం ప్రారంభం సందర్భంగా మోహన్ బాబు, చంద్రబాబు మధ్య చర్చలు సాగాయి. పార్టీలో చేరేందుకు సమ్మతించారు. వైసీపీలో అందరికి అన్యాయం జరగడంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మోహన్ బాబు టీడీపీని ఆశ్రయిస్తున్నట్లు చెబుతున్నారు. వారి మధ్య చర్చలో పలు విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇద్దరి మధ్య సమన్వయం కుదరడంతో ఇక టీడీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఆయన పోటీకి సై అంటున్నారు. సీఎం జగన్ వైఖరితోనే చాలా మంది నైరాశ్యంలో పడిపోయారు. దీంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. వైసీపీకి ఎంత చేసినా గుర్తింపు లేకపోవడంతోనే ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మోహన్ బాబు టీడీపీలో ఎంట్రీతో రాజకీయం మారిపోతుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాక కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వైసీపీని ఎదుర్కొనే క్రమంలో మోహన్ బాబు సరైన నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా మోహన్ బాబ ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగానే టీడీపీలోకి రంగ ప్రవేశం చేసి వైసీపీని దెబ్బకొట్టాలని చూస్తున్నట్లు సమాచారం. వైసీపీకి ఎంత సేవ చేసినా కనీస మర్యాద కూడా లేకపోవడంతోనే చాలా మంది కళాకారులు నిరాశతో ఉన్నారు. మోహన్ బాబు కూడా అదే విధంగా మోసపోవడంతో 2024లో మాత్రం టీడీపీతో జత కట్టి వైసీపీకి షాక్ ఇవ్వాలని చూస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.