Comedian Saptagiri: హీరో బాలకృష్ణ చర్యలు ఊహాతీతం. ఈ నందమూరి అందగాడు ఎప్పుడేమి చేస్తాడో ఎవరికీ తెలియదు. కోపం వస్తే కొట్టడం ప్రేమ పుడితే పెట్టడం ఆయన నైజం. ఫీలింగ్ ఏదైనా దాచుకోకుండా బయటపెట్టేస్తాడు. ఇక గ్రాంధికంలో పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పడం బాలయ్యకు మహా సరదా. ఈ టాలెంట్ ఉన్నవాళ్లను బాలయ్య బాగా ఇష్టపడతారు. అలాంటి టాలెంట్ చూపించిన నటుడు సప్తగిరి కాళ్ళు మొక్క ప్రయత్నం చేసి బాలయ్య వార్తలకెక్కాడు. సప్తగిరి వంటి ఓ చిన్న స్థాయి నటుడి కాళ్ళు బాలయ్య పట్టుకునే ప్రయత్నం చేయడం టాలీవుడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది.
నిజానికి బాలయ్య ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్. నిలువెల్లా ఆత్మాభిమానం, గౌరవం, పౌరుషం ఆయనలో తొణికిసలాడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీ సపరేట్ బ్రీడ్ అంటారు. అటువంటి మనస్తత్వం కలిగిన బాలయ్య నటుడు సప్తగిరికి అంత గౌరవం ఇవ్వడానికి ఓ కారణం ఉంది. NBK 107 సెట్స్ లో బాలయ్య, సప్తగిరి సరదాగా డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ భారీ డైలాగ్ బాలకృష్ణ మధ్యలో మర్చిపోయాడు.
బాలయ్య మర్చిపోయిన ఆ డైలాగ్ ని సప్తగిరి గుర్తు పెట్టుకుకొని అక్కడ నుండి కంటిన్యూ చేసి పూర్తిగా చెప్పాడు. సప్తగిరి టాలెంట్ కి ఫిదా అయిన బాలయ్య…’ఆ కాళ్లు కొంచెం పైకి లేపరా బాబు దండం పెడతా’ అన్నాడు. అంత పెద్ద స్టార్ రియాక్షన్ చూసి సప్తగిరి ఖంగుతిన్నాడు. అయ్యో అంటూ క్రింద కూర్చొని బాలయ్యకు నమస్కారం పెట్టాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బాలకృష్ణ సరదాగా సప్తగిరి కాళ్ళకు దండం పెడతా అన్నాడు.
మరోవైపు NBK 107 షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఈ మూవీలో సప్తగిరి సైతం కీలక రోల్ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని యాక్షన్ ఎంటర్టైనర్ గా NBK 107 తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు సినిమాపై ఆసక్తి పెంచేశాయి. బాలయ్య లుక్ ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
Balayya babu and Saptagiri funny conversation #NandamuriBalakrishna#Balakrishna #Saptagiri #NBK107 pic.twitter.com/iD6yDwo0zm
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 9, 2022