YS Jagan Praja Sankalpa Yatra: ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోసం జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర చేపట్టి నేటితో నాలుగు వసంతాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన పాదయాత్ర ఇప్పటికి ప్రజల్లో కలకాలం గుర్తుండే పోతోంది. పాదయాత్రలో ఆయన ఇచ్చిన హామీలు, నెరవేర్చిన పనులు అన్ని చూస్తుంటే జగన్ కు కలిసొచ్చిన పాదయాత్రతోనే అధికారం చేజిక్కించకున్నారు. 2017 నవంబర్ 6న పాదయాత్ర ప్రారంభించారు. 13 జిల్లాల ద్వారా సాగిన పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9న ముగిసింది.

రాష్ర్టంలో 231 మండలాలు, 2516 గ్రామాల మీదుగా 341 రోజులు సాగింది. 3648 కిటోమీటర్ల మేర కొనసాగింది. 124 చోట్ల సభలు, 55 చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రజా సమస్యలు దగ్గరుండి పరిశీలించిన జగన్ కు పాదయాత్ర ద్వారా ఎన్నో విషయాలు తెలిశాయి. ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి పలు మార్గాలు అన్వేషించారు.
పాదయాత్రలో ఆరోగ్యం, చదువుపై ప్రజలు తమ కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా చర్యలు తీసుకుంటానని అక్కడే హామీ ఇచ్చారు. దీంతో వాటి పరిష్కారానికి తగు మార్గాలు వెతికారు. దీంతో ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నీతివంతమైన పాలనే ధ్యేయంగా ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్రజల మనసులను గెలుచుకున్నారు.
ఇందులో భాగంగా గ్రామ సచివాలయాలు అమల్లోకి తెచ్చారు. స్థానిక స్వపరిపాలనతోనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందని గుర్తించిన జగన్ ఆ దిశగా అడుగులు వేశారు. ప్రస్తుతం సచివాలయాల ద్వారా ప్రజలకు నేరుగా పథకాలు అందుతుండటంతో జగన్ కు ఎదురు లేకుండా పోతోంది. రాష్ర్టంలో ఏ ఎన్నికలు వచ్చినా విజయం జగన్ దే అవుతోంది. దీంతో ప్రతిపక్షాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో కూడా జగన్ కే ప్రజలు పట్టం కడతారని తెలుస్తోంది.
సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట వేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను సమపాళ్లలో పదవులు కట్టబెడుతూ అందరిని మచ్చిక చేసుకుంటున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తూచ తప్పకుండా పాటిస్తూ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారు. నామినేటెడ్ పదవుల్లో సైతం అందరికి తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నారు. మహిళల భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు.
Also Read: Bjp Politics: ఉప ఎన్నికల్లో ఇచ్చిన షాక్ తోనే బీజేపీ తేరుకుందా?
ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికలో కూడా వైసీపీ ఎదురులేని విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన పోరులో 90 వేల మెజార్టీ సాధించడం గొప్ప విషయమే. దీంతో ఏపీలో ప్రస్తుతం వైసీపీకి ఎదురు లేదని తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారంలో జగన్ చూపుతున్న చొరవతో ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తోంది. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే మంచి స్థానం దక్కించుకుంటున్నారు.
Also Read: ప్రజలన్నీ చూస్తూ ఉంటారు.. సమయమొచ్చినప్పుడే చెప్తారు..