
వైఎస్ షర్మిల తన విమర్శలకు పదును పెడుతున్నారు. ఎవరైనా ఒకటే అని అందరిని టార్గెట్ చేస్తున్నారు. రెడ్డి అనే తేడా లేకుండా అందరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తనదైన శైలిలో దూషించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం అక్కున చేర్చుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజల్లో చులకన అయిందన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినా ఆయన తాత వచ్చినా పరిస్థితి మారదని చెప్పారు.
అంతర్జాతీయ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా షర్మిల నెటిజన్లకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో తమ పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు. రాష్ర్టంలో పేదవారి కోసం పోరాటం చేస్తామని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ లకు సోషల్ మీడియా ఉద్యోగులు ఉన్నట్లు తమకు లేరని చెప్పారు. రాజన్నసైన్యమే సోషల్ మీడియా కార్యకర్తలు అని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.
షర్మిల తాజా రాజకీయ పరిస్థితులపై గళమెత్తారు. రాష్ర్ట ప్రజలు అభద్రతా భావంతో ఉన్నారన్నారు. సమస్యలు ఎక్కడికక్కడే తిష్ట వేశాయని చెప్పారు. ప్రభుత్వం ప్రజా సమస్యలు పట్టించుకోకుండా చోద్యం చూస్తుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పరిస్తితుల్లో ప్రజల పక్షాన నిలిచిపోరాడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వాల అసమర్థతను ఎండగట్టేందుకు వెనుకాడేది లేదని తెగేసి చెప్పారు.
రేవంత్ రెడ్డిని తనదైన వ్యూహంతో విమర్శలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించలేరన్నారు. కాంగ్రెస్ లో తలపండిన నేతలుండగా ఈయనకు పదవి ఇవ్వడంతో అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో8 పూర్తి స్థాయిలో పార్టీని ప్రకటించి ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని అన్నారు.