Revanth Reddy Strategy: తెలంగాణలో రాజకీయాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించడంతో పార్టీని ఎక్కడికో తీసుకెళ్లారని అంతా అనుకున్నారు. కానీ ఎక్కడికి తీసుకెళ్లలేకపోతున్నారు. అంతా పాత చింతకాయ పచ్చడిలా మారింది. దీంతో కాంగ్రెస్ లో మార్పులు వస్తాయని అనుకున్నా అంతా వట్టిదే అని తేలిపోయింది. అధిష్టానం సూచనల మేరకే నడుచుకోవాల్సి వస్తోంది. దీంతో కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికే వచ్చిందని తెలుస్తోంది. దేశమంతా ఎక్కడికో వెళ్లిపోతోంటే కాంగ్రెస్ మాత్రం పాత వాటిని పట్టుకుని వేలాడుతోంది. ఫలితంగా అంచనాలు అందుకోకుండా వెనుకబడిపోతోంది. ఈ నేపథ్యంలో ఇంకా యాభై ఏళ్లయినా కాంగ్రెస్ పాత వాటిని నమ్ముకుని రాజకీయం చేస్తుందే తప్ప నూతన పద్ధతులు ఆవిష్కరించడం చేయదనే తెలుస్తోంది.

ఇటీవల కాలంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే రాష్ర్ట బీజేపీ నేతలు నడుచుకోవడం చూస్తుంటే బీజేపీ అధిష్టానం కూడా రాష్ర్ట రాజకీయాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలుస్తోంది. ధాన్యం కొనుగోలు అంశాన్ని రెండు పార్టీలు తెరమీదకు తీసుకొచ్చి తప్పు మీదంటే మీదంటూ ఆరోపణలు చేసుకుంటున్నాయి.
Also Read: రేవంత్ సీరియస్ గా తీసుకుంటేనే ఛాన్స్.. లేదంటే?
ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల్లో విజయం సాధించి అధికార పార్టీ టీఆర్ఎస్ కు సవాలు విసిరింది. దీంతో టీఆర్ఎస్ లో భయం పట్టుకుంది. మరోవైపు గత కొద్ది రోజులుగా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెబుతుండటంతో టీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు. ఎలాగైనా బీజేపీని ఎదగనీయకుండా చేయాలని సంకల్పిస్తోంది. ఇందులో భాగంగానే ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తోంది.
టీఆర్ఎస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేయడం చూస్తుంటే ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. పాత చింతకాయ పచ్చడి లాగా ఆయన విమర్శలు కూడా పాతగానే ఉన్నాయనే భావన అందరిలో వస్తోంది.
Also Read: కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళనకు రేవంత్ అడుగులు.. సాధ్యమయ్యేనా?