https://oktelugu.com/

కూసింత రేవంత్ ను అర్థం చేసుకోండయ్యా..!

తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. ఎట్టకేలకు టీపీసీ ఛీప్ నియామకం పూర్తవడంతో కాంగ్రెస్ పెద్ద అంకానికి తెరపడినట్లయింది. కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా కోరుకున్న నాయకుడికే అధిష్టానం పీసీసీ పదవీని కట్టబెట్టడంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది. గత రెండుమూడ్రోజులుగా రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. వీరి రాకతో రేవంత్ తీరికలేకుండా గడుపుతున్నాడు. అలాగే తనను అధిష్టానం […]

Written By: , Updated On : June 30, 2021 / 03:49 PM IST
Follow us on

తెలంగాణ ప్రదేశ్ కమిటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల ప్రకటించింది. ఎట్టకేలకు టీపీసీ ఛీప్ నియామకం పూర్తవడంతో కాంగ్రెస్ పెద్ద అంకానికి తెరపడినట్లయింది. కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా కోరుకున్న నాయకుడికే అధిష్టానం పీసీసీ పదవీని కట్టబెట్టడంతో కార్యకర్తల్లో ఫుల్ జోష్ నెలకొంది.

గత రెండుమూడ్రోజులుగా రేవంత్ రెడ్డిని కలుసుకునేందుకు ఇతర ప్రాంతాల నుంచి పెద్దఎత్తున నేతలు, కార్యకర్తలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. వీరి రాకతో రేవంత్ తీరికలేకుండా గడుపుతున్నాడు. అలాగే తనను అధిష్టానం టీపీసీసీగా నియమించిన తర్వాత రేవంత్ సైతం కాంగ్రెస్ లోని సీనియర్ నేతలు.. ముఖ్య నాయకుల ఇంటికి స్వయంగా వెళుతూ వారి సహకారాన్ని కోరుతున్నాడు.

ఇంత బీజీగా సమయంలోనూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లపై సైటర్లు వేస్తూ తనదైన శైలిలో దూకుడు చూపిస్తున్నాడు. మరోవైపు తనకు వ్యతిరేకంగా ఉన్న నేతలను సైతం కలుపుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవల వీహెచ్ హన్మంతరావును ఆస్పత్రిలో ఉండగా ఆయనను రేవంత్ పరామర్శించారు. దీంతో హన్మంతరావు కొంత మెత్తబడినట్లు తెలుస్తోంది.

అదేవిధంగా సీనియర్ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీతో భేటీ అయి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క నిన్న వంద కార్లతో హైదరాబాద్ కు బయలుదేరి రేవంత్ కు తన మద్దతు ప్రకటించారు. ములుగు ప్రజలు సీతక్కకు అండగా ఉండాలని ఈ సందర్భంగా రేవంత్ కోరాడు. సీతక్క తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండగా ఆమెను పరామర్శించి బాగోగులు తెలుసుకున్నారు.

తాజాగా హైదరాబాద్లోని కొండా సురేఖ అతిథి గృహానికి రేవంత్ రెడ్డి వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రేవంత్ కు మంగళహారతులతో కొండా సురేఖ స్వాగతం పలికారు. అనంతరం ఆయనకు శాలువాతో సన్మానించారు. తమ సహకారం రేవంత్ కు ఉంటుందని కొండా దంపతులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తన కోసం దూరప్రాంతాల నుంచి అభిమానులు పెద్దసంఖ్యలో తరలివస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి తన సోషల్ మీడియాలో ఒక వినతి చేశారు. బుధ, గురువారాల్లో తనకు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఉందని పేర్కొన్నారు. ఈ రెండ్రోజులు ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు తాను ఎవరినీ కలుసుకోవడానికి వీలుపడదని తెలిపారు.

తనను ఎవరైనా కలుసుకోవాలంటే మాత్రం ఈ రెండురోజుల్లో సాయంత్రం 4గంటల తర్వాతే రావాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. బీజీ షెడ్యూల్ కారణంగా ఈ విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలంటూ రేవంత్ సోషల్ మీడియా వేదికగా కోరారు. మరోవైపు రేవంత్ రెడ్డి హూజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో తొలి టాస్క్ ఎదురు కానుంది. దీనిపై కూడా రేవంత్ రెడ్డి దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మొత్తానికి రేవంత్ రాకతో కాంగ్రెస్ లో జోష్ పెంచినట్లు కన్పిస్తుంది.