https://oktelugu.com/

Revanth Reddy: రాహుల్ గాంధీ కోసం రేవంత్ తొక్కని గడపలేదు! అడగని వారులేరు!

Revanth Reddy: రాహుల్ గాంధీ పర్యటన కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొక్కని గడపలేదు.. అడగని వారులేరు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతివ్వాలని వీసీని.. అరెస్ట్ అయిన ఎన్.ఎస్,యూఐ విద్యార్థులను రాహుల్ పరామర్శించడానికి అవకాశం కల్పించాలని జైళ్ల శాఖ డీజీని రేవంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. ఇలా ఎంత తిరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ మాత్రం ససేమిరా అంటూ అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు. తాజాగా జైల్ డిజి జితేందర్ ను కాంగ్రెస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2022 / 07:14 PM IST
    Follow us on

    Revanth Reddy: రాహుల్ గాంధీ పర్యటన కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తొక్కని గడపలేదు.. అడగని వారులేరు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఉస్మానియా యూనివర్సిటీలోకి అనుమతివ్వాలని వీసీని.. అరెస్ట్ అయిన ఎన్.ఎస్,యూఐ విద్యార్థులను రాహుల్ పరామర్శించడానికి అవకాశం కల్పించాలని జైళ్ల శాఖ డీజీని రేవంత్ రెడ్డి కలిసి వినతిపత్రం అందించారు. ఇలా ఎంత తిరుగుతున్నా టీఆర్ఎస్ సర్కార్ మాత్రం ససేమిరా అంటూ అనుమతులు మాత్రం ఇవ్వడం లేదు.

    తాజాగా జైల్ డిజి జితేందర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ రావడానికి విసిని కలసి వినతిపత్రం ఇచ్చామన్నారు. విద్యార్థుల పిలుపు మేరకు రాహుల్ గాంధీ వస్తున్నాడని.. అనుమతి ఇవ్వలేదన్నారు.. అయినా చాలా కేసులు నమోదు చేసి జైలు కు పంపించారన్నారు.

    చంచల్ గూడ జైల్లో ఉన్న విద్యార్థులను కలవడానికి రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలని జైల్ డిజి జితేందర్ ను కాంగ్రెస్ నేతలు కలిశారు. మే7న రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు వస్తాడని.. జైల్ సూపరింటెండెంట్ కూడా అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నామన్నారు. జైల్ సూపర్ డెంట్ జైల్ డిజి ని కలవండి అని చెప్పారన్నారు. ఎలాంటి ఖైదీలను కలిసే హక్కు ఎవరికైనా ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు.

    ప్రజా ప్రతినిధులు జైల్లో ఉన్న విద్యార్థులను కలవాడానికి అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. 18 మంది ఎన్.ఎస్.యూఐ విద్యార్థులు జైల్లో ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. జైల్ డిజి మళ్ళీ ఆలోచించి నిర్ణయం చెపుతామన్నారు.. అధికారుల పై నాయకులు ఒత్తిడి తెస్తున్నారని.. అధికారం శాశ్వతం కాదని.. ఇది నిరంకుశ పాలన అని రేవంత్ ధ్వజమెత్తారు.. ప్రజాస్వామ్య బద్దంగా అనుమతి కోరుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.

    రాహుల్ గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. పీవీ నరసింహారావు,మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర కాంగ్రెస్ ది అన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. వడ్లు కొనమని రైతులు అడుగుతుంటే ధర్నాల పేరుతో ఈ రెండు పార్టీలు వీ నాటకాలు ఆడుతున్నాయన్నారు.

    రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి నీ ఎండగట్టేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తె రైతులకు ఏం చేయబోతున్నాం అనేది డిక్లరేషన్ ప్రకటిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఖాయమని రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చుపుతామన్నారు. అధికారంలోకి వచ్చాక 2004 నాటి స్వర్ణమైన పాలన అందిస్తాం. రైతులకు మళ్ళీ అన్నిరకాల సబ్సిడీలు అందిస్తామన్నారు.

    వరంగల్ సభకు రాష్ట్రంలో రైతులు కుటుంబానికి ఒక్కరు తరలి రావాలని రేవంత్ పిలుపునిచ్చాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై చేయబోతున్న యుద్దానికి రైతులు అండగా నిలబడాలన్నారు. ప్రతిబుత్ ఎన్ రోలర్ తొమ్మిది మందిని తీసుకురావాలన్నారు.కేసీఆర్ అవినీతికి అవధులు లేవన్నారు.

    యాదగిరి నరసింహ స్వామి దేవాలయ నిర్మాణం లో కూడా అవినీతి జరిగిందని రేవంత్ సంచలన ఆరోపణలు చేశారు. రెండువేల కోట్ల తో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందన్నారు. యాదగిరి నరసింహ స్వామి కూడా కేసీఆర్ కుటుంబానికి బలైపోయారన్నారు. అమరవీరుల స్థూపం లో కూడా అవినీతి జరిగిందన్నారు. రూ.62 కోట్లతో మొదలు పెట్టిన స్థూపం .. రెండువందల కోట్లు చెల్లించినా పుర్తి కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబం ఆస్తులు నిజాం వారసుల సంపదను మించిపోయిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.