https://oktelugu.com/

సంచలన నిర్ణయం దిశగా రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేందుకు కష్టపడుతున్నారు. నాయకులను ఏకం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం పాటుపడాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తే వారి పట్ల కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏ విధమైన వ్యూహాలు అవలంభిస్తారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. హుజురాబాద్లో […]

Written By: , Updated On : July 12, 2021 / 06:18 PM IST
Follow us on

Revanth Reddy about Kaushik Reddyటీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపిస్తున్నారు. కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేందుకు కష్టపడుతున్నారు. నాయకులను ఏకం చేసి కాంగ్రెస్ గెలుపు కోసం పాటుపడాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తే వారి పట్ల కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఏ విధమైన వ్యూహాలు అవలంభిస్తారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

హుజురాబాద్లో కాంగ్రెస్ నుంచి బరిలో దిగే అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి పేరు వినిపించింది. అదే సమయంలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి అనే వీడియో వైరల్ కావడంతో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఆయన ఒకసారి కేటీఆర్ తో మాట్లాడిన సమయంలోనే కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లి పోటీలో ఉంటారని వార్తలు వచ్చిన నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ కౌశిక్ రెడ్డికి షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీనికి ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరడంతో ఎలాంటి సంజాయిషీ ఇస్తారోననే దానిపై ఆసక్తి నెలకొంది.

కౌశిక్ రెడ్డి అభ్యర్థిత్వంపై రేవంత్ రెడ్డి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో కౌశిక్ రెడ్డిని కాదని వేరే వారికి టికెట్ ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండే వారిపై రేవంత్ రెడ్డి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి తీసుకునే చర్యలపైనే అందరి చూపు పడింది. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ముద్ర ఉండేలా చూసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

మొత్తానికి కాంగ్రెస్ లో సమూల మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీని క్షేత్రస్థాయినుంచే ప్రక్షాళన చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇప్పటికే బీజేపీ అభ్యర్థి ఖరారు కావడంతో మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈటలను ఢీకొట్టే నేతల కోసం అన్వేషిస్తున్నాయి. దీంతో పలువురి గురించి ఆరా తీస్తున్నారు. సామాజిక సమీకరణల నేపథ్యంలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి.