రూ.50 కోట్లు ఇచ్చి రేవంత్ రెడ్డి అధ్యక్షుడయ్యాడా?

కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో సీనియర్లు ఉండగా వారిని కాదని రూ.50 కోట్లు పెట్టి పీసీసీ పదవిని కొనుక్కున్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తనకు 62 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. కనీసం డిపాజిట్లు కూడా రాని వారు నేతలా అని ప్రశ్నించారు. హుజురాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ ను పోటీ చేయించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు […]

Written By: Srinivas, Updated On : July 12, 2021 6:38 pm
Follow us on

కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీరుపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ లో సీనియర్లు ఉండగా వారిని కాదని రూ.50 కోట్లు పెట్టి పీసీసీ పదవిని కొనుక్కున్నారని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో తనకు 62 వేల ఓట్లు వచ్చాయని చెప్పారు. కనీసం డిపాజిట్లు కూడా రాని వారు నేతలా అని ప్రశ్నించారు. హుజురాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్ ను పోటీ చేయించాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ఆయనకు కరీంనగర్ లో కనీసం డిపాజిట్ కూడా రాలేదని అన్నారు.

రేవంత్ రెడ్డి ఈటలకు అమ్ముడుపోయారని విరుచుకుపడ్డారు. తెలంగాణను చంద్రబాబు పాదాల దగ్గర తాకట్టు పెట్టాడంటూ విమర్శించారు. రేవంత్ కు పీసీసీ పదవి ఇవ్వడం సీనియర్లకు ఇష్టం లేదని అన్నారు. అందుకే వారు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క వంటి వారంతా ఆగ్రహంతో ఉన్నారన్నారు.

రేవంత్, పొన్నం కలిసి హుజురాబాద్ లో డిపాజిట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. డాన్సర్ ముమైత్ ఖాన్ వచ్చినా జనాలు విజిల్స్ వేస్తారన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముమైత్ ఖాన్ గా అభివర్ణించారు. తన భవిష్యత్ కార్యాచరణ హుజురాబాద్ నియోజకవర్గంలో అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మూడు రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ వెల్లడిస్తానని చెప్పారు.

కాంగ్రెస్ రాష్ర్ట వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఓ యూస్ లెస్ ఫెలో అని మండిపడ్డారు. సీనియర్లు ఉండగా వారిని కాదని పార్టీలు మారిన వ్యక్తికి పీసీసీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మొత్తానికి హుజురాబాద్ రాజకీయం పెను మలుపులు తిరుగుతోంది. పార్టీల్లో చోటు చేసుకుంటున్నపరిణామాలు చూస్తుంటే ఏ పార్టీ ఎటు వైపు వెళ్తుందో చెప్పడం కష్టంగా మారింది.

హుజురాబాద్ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఎలాగైనా విజయం సాధించాలనే తపనతో ముందుకు కదులుతున్నాయి. ప్రత్యర్థి పార్టీల బలాబలాలపై సమీక్షలు చేస్తూ తమ బలం పెంచుకునే దిశగా వ్యూహరచన చేస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని భావించినా ప్రస్తుతం కాంగ్రెస్, వైఎస్సార్ టీపీ, టీజేఎష్ లాంటి పార్టీలు కూడా తమ అభ్యర్థులను రంగంలోకి దింపుతామని ప్రకటించిన నేపథ్యంలో పోటీ రసవత్తరంగా సాగనుందని విశ్లేషకులు చెబుతున్నారు.