Tollywood Movies 2022: ఈ సమ్మర్ టాలీవుడ్ ను ఊపు ఊపడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే మూడు పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి. అన్నింటికంటే ముందర భీమ్లా నాయక్ వస్తోంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ రానున్నాయి. నెలరోజుల గ్యాప్ లోనే ఇవన్నీ థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాల్లో ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్ పై బోలెడు అంచనాలున్నాయి. ఈ నాలుగు సినిమాల బడ్జెట్ కలిపితే ఏకంగా 1100 కోట్ల రూపాయలు అవుతుంది.
సినిమాలలో కొన్ని అంశాలు చూస్తే ఆర్ఆర్ఆర్, భీమ్లానాయక్ లు ధృఢంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇదివరకూ రిలీజ్ అయిన అఖండ, పుష్పలను మించి ‘భీమ్లానాయక్’ ట్రైలర్ వ్యూస్ సాధించడంతో ఇక ఆ సినిమాకు తిరుగులేదని అర్థమవుతోంది.
ఇప్పటికే కరోనా ముగిశాక ‘అఖండ’ ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. ఆ తర్వాత పుష్ప హిట్ గా నిలిచింది.పుష్పకు బాలీవుడ్ లో, టాలీవుడ్ లో పోటీలేకపోవడం సినిమాకు ప్లస్ అయ్యింది. అయితే క్లైమాక్స్ సరిగా లేకపోవడం.. లుక్స్ మరీ భయంకరంగా వెటకారంగా ఉండడం.. రెండు పార్టులుగా మారడం పుష్ప మూవీకి మైనస్ గా మారింది.
ఇక రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’కు ప్యాన్ ఇండియా స్థాయిలో బజ్ ఉంది. చరణ్, ఎన్టీఆర్ హీరోలు కావడం.. బాహుబలి తర్వాత రాజమౌళి తీస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమా ఆడియో పెద్దగా ప్రేక్షకుల అంచనాలు అందుకోకపోవడం మైనస్ గా మారింది. కథ చూస్తే చరిత్రను జక్కన్న వక్రీకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.
Also Read: ‘విజయ్ దేవరకొండ’తో కేజీఎఫ్ హీరోయిన్ రొమాన్స్
ప్రభాస్, పూజాల రాధేశ్యామ్ కు హిందీలో భారీ అంచనాలున్నాయి. లవ్ స్టోరీ, పాటలు, ఫీల్ గుడ్ మూవీ అన్న కాన్సెప్ట్ తో ఈ సినిమాకు ప్లస్ గా మారింది. అయితే యాక్షన్ సీన్ లు లేకపోవడం మైనస్ అంటున్నారు.
ఇక భీమ్లా నాయక్ మూవీ విషయానికి వస్తే కొదమ సింహాల్లాంటి హీరోలు రానా, పవన్ లు నటిస్తుండడం..పైగా మలయాళ హిట్ మూవీ రిమేక్ కావడంతో సినిమాపై ఇప్పటికే సక్సెస్ అంచనాలున్నాయి. అదే ఈ సినిమాకు ప్లస్. ఇక పాటలు అదిరిపోయే ఉండడం సినిమాకు హైప్ తెచ్చాయి. రీమేక్ మూవీ కావడంతో సినిమాను పోల్చిచూసే ఛాన్స్, కథలో మార్పులు చేశారనే ప్రచారం ఈ సినిమాకు మైనస్ అంటున్నారు.
Also Read: ‘భీమ్లానాయక్’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ టైమ్ ఫిక్స్
Recommended Video: