Revanth Reddy- KCR: తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. ఎనిమిదేళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీని.. ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు బీఆర్‌ఎస్‌గా మార్చారు. జాతీయ రాజకీయాల కోసం పార్టీ పేరులో మార్పు చేశారు. ఈమేరకు ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. ఈనెల 9న బీఆర్‌ఎస్ ఆవిరాభవ వేడుక కూడూ నిర్వహించారు కేసీఆర్. అయితే టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా పేరు మార్చడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో టీఆర్‌ఎస్ బంగారు కూలీ పేరుతో నిధులు సమకూర్చుకున్న అంశంపై ఈసీ రేవంత్ ఫిర్యాదు చేశారు.

ఎన్నికల కమిషన్ లేఖ
టీఆర్‌ఎస్ సమకూర్చుకున్న నిధులపై విచారణ జరపాలని అప్పుడే అప్పుడే ఆదాయపు పన్ను శాఖకు ఎన్నికల కమిషన్ లేఖ పంపింది. ఈ విషయంపై విచారణ చేయకముందే పేరు మార్పుపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ జరపనుంది.
డిసెంబర్ 8న అనుమతి..
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) పేరును భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)గా మార్చుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 8న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా టీఆర్‌ఎస్ పేరును బీఆర్‌ఎస్‌గా మారుస్తూ అక్టోబర్ 5న పార్టీ సంయుక్త సమావేశంలో తీర్మానం చేశారు. ఈ తీర్మానంతో పాటు సీఈసీకి కేసీఆర్ రాసిన లేఖను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, పార్టీ జనరల్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.

ఢిల్లీలో కేంద్ర కార్యాలయం..
టీఆర్‌ఎస్ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చడంపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలంటూ నవంబర్ 7న పబ్లిక్ నోటీస్ జారీ అయింది. ఆ గడువు డిసెంబర్ 7తో ముగిసింది. దీంతో పార్టీ పేరు మార్పుకు సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 14న ఢిల్లీలో తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఢిల్లీలో పార్టీ జాతీయ స్థాయి తాత్కాలిక ఆఫీసును ప్రారంభించారు. సర్దార్ పటేల్ మార్గంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బీఆర్‌ఎస్ ఆఫీస్‌ని పండితులు, ఇతర పార్టీల నేతల సమక్షంలో ప్రారంభించారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగరేశారు. కార్యక్రమానికి యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేసీఆర్ సతీమణి శోభమ్మ, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.