Homeజాతీయ వార్తలుRevanth Reddy: జాతీయ మీడియా ముందే తన గురువు చంద్రబాబుకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: జాతీయ మీడియా ముందే తన గురువు చంద్రబాబుకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కానీ, తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు, చేస్టలతో సంకటంలో పడిపోతున్నారు. కార్యకర్తలపై చేయి చేసుకోవడం, కాలితో తన్నడం, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, గిరిజనులను కించపర్చేలా మాట్లాడడం కాంగ్రెస్‌ విజయానికి కాస్త ఆటకంగా మారుతున్నాయి. టీవీ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ నోరు జారుతున్నారు.

తాజాగా గురువు బాబుపై..
ఒకవైపు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఒంటిచేత్తో నడిపిస్తున్న రేవంత్‌రెడ్డి ఇటీవల ఇండియా టుడేకు ఇంటర్వ్యూ ఇచ్చారు. లంచ్‌మీట్‌ తరహాలో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూలో తన రాజకీయ గురువు నారా చంద్రబాబుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. వాస్తవానికి హైటెక్‌సిటీ అంటేనే చంద్రబాబు నాయుడు అన్నంతగా మారిపోయింది. కానీ, ఈ క్రెడిట్‌ను రేవంత్‌ తన రాజకీయ గురువుకు ఇవ్వలేదు. 1993లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండగా నేదురుమల్లి జనార్ధనరెడ్డి హైటెక్‌ సిటీకి ఫౌండేషన్‌ స్టోన్‌ వేశారని తెలిపారు. తర్వాత కూడా కాంగ్రెస్‌ సీఎంగా ఉన్న రాజశేఖరరెడ్డి హయాంలో ఐటీ కంపెనీలు, ఏయిర్‌ పొర్టు, ఔటర్‌ రింగ్‌ రోడ్, ఫార్మా కంపెనీలు వచ్చాయ్‌. అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. దానిని చంద్రబాబు నాయుడు కొనసాగించారని వెల్లడించారు.

వైఎస్సార్‌కు క్రెడిట్‌..
ఇదే ఇంటర్వ్యూలో రేవంత్‌.. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డికి క్రెడిట్‌ ఇచ్చారు. ఐటీ కంపెనీలు హైదరాబాద్‌లో విస్తరించడానికి వైఎస్సార్‌ చొరవే కారణమన్నారు. ఆయన తీసుకున్న నిర్ణయాలతోనే అనేక కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయని తెలిపారు. దానికి కొనసాగింపుగానే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఐటీ కంపెనీలను తీసుకువచ్చిందని వెల్లడించారు.

టీడీపీ ఓట్లపై ప్రభావం..
చంద్రబాబు నాయుడు గురించి రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తెలంగాణలో టీడీపీ పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. బహిరంగంగా ఎవరూ చెప్పకపోయినా ఇది నిజం. రేవంత్‌ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శిష్యుడు అన్న కారణంగానే టీడీపీ కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. కానీ, రేవంత్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా టీడీపీ ఓట్లపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular