Revanth Reddy: తాడోపేడో తేలిపోవాలి.. రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం

Revanth Reddy: పోగొట్టుకున్నచోట వెతుక్కోవాలి అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కెసిఆర్ చేతిలో ఓడిపోయాడు. జైలు శిక్ష అనుభవించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా పార్టీలో విలువ లేకుండా పోతోంది. దీనికి తోడు సీనియర్ల తలనొప్పులు. ఇందులో ఎవరు కెసిఆర్ కోవర్టో అర్థం కాని పరిస్థితి. పైగా తన అధ్యక్ష పదవిని ప్రశ్నిస్తూ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ […]

Written By: K.R, Updated On : April 3, 2023 4:54 pm
Follow us on

Revanth Reddy

Revanth Reddy: పోగొట్టుకున్నచోట వెతుక్కోవాలి అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడు. కొడంగల్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కెసిఆర్ చేతిలో ఓడిపోయాడు. జైలు శిక్ష అనుభవించాడు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత కూడా పార్టీలో విలువ లేకుండా పోతోంది. దీనికి తోడు సీనియర్ల తలనొప్పులు. ఇందులో ఎవరు కెసిఆర్ కోవర్టో అర్థం కాని పరిస్థితి. పైగా తన అధ్యక్ష పదవిని ప్రశ్నిస్తూ సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తాడో పేడో తేలిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికి పార్టీలోని సీనియర్లు కూడా ఓకే చెప్పాల్సిన పరిస్థితి కల్పించాడు.

ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో భారత రాష్ట్ర సమితి పార్టీ బలంగానే ఉంది.. ఈ బలాన్ని బలహీనం చేయాలంటే ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించగలిగాలి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో భరోసా కల్పించాలి. ఇవి జరిగితేనే కెసిఆర్ ఓడిపోతాడు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగలుగుతాడు. ఓడిస్తే ఓడిపోలేనంత బలవంతుడేమీ కేసీఆర్ కాదు. అందుకే రేవంత్ రెడ్డి మరోమారు సమర శంఖం పూరించాడు.. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచి జంగ్ సైరన్ వినిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాడు. దీనికంటే ముందుగానే తన విధివిధానాలను సీనియర్లతో చర్చించాడు. ఈ విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పాడు. అంటే ఒకే దెబ్బకు రెండు పిట్టలు. తన మాటకు ఎదురు లేకుండా చూసుకున్నాడు. సీనియర్లు తోక జాడించ కుండా కత్తిరించాడు.. టార్గెట్ ఇస్ క్రిస్టల్ క్లియర్.

ఇక ఈనెల 25న గజ్వేల్ లో రేవంత్ రెడ్డి భారీ సభ నిర్వహిస్తున్నాడు. లక్ష మందితో జన సమీకరణ చేయాలని యోచిస్తున్నాడు. అన్ని బాగుంటే రాహుల్ గాంధీని మరోసారి తెలంగాణకు తీసుకురావాలని సూచిస్తున్నాడు. ఈ వేదిక ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అక్రమాలు, పద్యం కుంభకోణంలో కవితను కాపాడుతున్న ఈ డి, ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా కేసిఆర్ కుటుంబం పొందుతున్న లబ్ది, బిజెపి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేయనున్నాడు. అన్నింటికంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ అనర్హత వేటు పై ప్రధానంగా మాట్లాడనున్నాడు.

Revanth Reddy

దీనికోసం ఓయూ విద్యార్థి సంఘాల భాగస్వామ్యం తీసుకోనున్నాడు. సౌత్ లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఆయువుపట్టు అని మరోసారి నిరూపించే ప్రయత్నం చేయమన్నాడు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఊహగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. అదే ఊపును తెలంగాణలో కూడా కొనసాగించాలని రేవంత్ రెడ్డి ఉవ్విళ్ళురుతున్నాడు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి ఇలాక నుంచి సమర శంఖం పూరించనున్నాడు. గతంలో నిరుద్యోగ సభ పెట్టి ప్రభుత్వ పెద్దల్లో రేవంత్ రెడ్డి వణుకు పుట్టించాడు. ఈసారి కూడా అంతకుమించి అనేలా సభ నిర్వహించి తెలంగాణ ప్రజల్లో కదలిక తేవాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నాడు. సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించకుండా ఉండేందుకు ఏకంగా హైకోర్టులో పిటిషన్ కూడా వేశాడు.. అన్నీ పకడ్బందీగా చేస్తున్న రేవంత్ కు కెసిఆర్ ఎలాంటి స్కెచ్ వేస్తాడో వేచి చూడాల్సి ఉంది.