Homeజాతీయ వార్తలుRevanth Reddy - Modi : అమ్మ రేవంతూ.. 5 రోజుల్లోనే మోడీ ముందర మాట...

Revanth Reddy – Modi : అమ్మ రేవంతూ.. 5 రోజుల్లోనే మోడీ ముందర మాట మడతెట్టేశావే?

Revanth Reddy – Modi : నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుందట.. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకుల నాలుక ఇంకా ఎక్కువ మాట్లాడుతుంది కాబోలు. ఎందుకంటే వేదిక తగ్గట్టుగా వారి ప్రసంగం ఉంటుంది. అవసరానికి తగ్గట్టుగా వారి మాట ఉంటుంది. అందుకే స్మశాన ముందు ముగ్గు.. రాజకీయ నాయకులకు సిగ్గు ఉండవని ఓ సినీ రచయిత రాశాడు.

పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ అధికారికంగా స్వాగతం పలకలేదు. బిజెపికి, భారత రాష్ట్ర సమితికి టర్మ్స్ బాగున్నప్పుడు ఆయన మోడీకి వెల్కమ్ చేసేవారు. కానీ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి తన కూతురు కవితను ఓడించాడో, అప్పటినుంచి కెసిఆర్ బిజెపి మీద యుద్ధం ప్రకటించారు. అప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల దాకా అదే తీరు ప్రదర్శించారు.. నరేంద్ర మోడీ వస్తే స్వాగతం పలకక పోవడం, నల్ల బెలూన్లు ఎగరవేయడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడం, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికారం కోల్పోయిన తర్వాత ప్రస్తుతం వ్యవసాయ క్షేత్రానికి పరిమితమయ్యారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలికి భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన నరేంద్ర మోడీకి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. స్వాగతం ఉపన్యాసం కూడా చేశారు. నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తేశారు. హైదరాబాద్ పై మీ చల్లని చూపు ఉండాలని కోరారు. తెలంగాణకు కేటాయింపుల విషయంలో అన్యాయం చేయవద్దని విన్నవించారు. మీ దయ ఉంటేనే తెలంగాణ గుజరాత్ రాష్ట్రం లాగా అభివృద్ధి సాధిస్తుందని ప్రకటించారు. అయితే ఇదే రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం మోడీ ప్రభుత్వ పనితీరును విమర్శించారు. “గుజరాత్ మోడల్ అంటే ఊర్లను తగలబెట్టడమా?, గుజరాత్ మోడల్ అంటే కంపెనీలను తరలించకపోవడమా?, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు..ఇదా మీ మోడల్” అంటూ రేవంత్ రెడ్డి ఇటీవల విమర్శలు చేశారు. అలా ఆయన మాట్లాడి వారం గడవక ముందే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తడం విశేషం. అది కూడా ఆయన సమక్షంలోనే.. “ఆరు గ్యారంటీలు అమలు చేయాలంటే భారీగా నిధులు కావాలి. కేంద్రం నుంచి కేటాయింపులు తెచ్చుకోవాలి. గత ప్రభుత్వానికి ఇది చేతకాలేదు. పైగా కేంద్రంతో గొడవ పెట్టుకుంది. దానివల్ల ఎలాంటి పరిణామాలు చవి చూడాల్సి వస్తుందో రేవంత్ కు తెలుసు. అందుకే కేంద్రంతో సహయుదుతో అందుకే కేంద్రంతో సయోధ్య కోరుకుంటున్నాడు. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాడు. తెలంగాణకు ఏం కావాలో చెప్పాడు. ఆ దిశలోనే అడుగులు వేస్తున్నాడని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రేవంత్ మాట్లాడిన మాటలపై భారత రాష్ట్ర సమితి నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక్క వేదికపై ఒక్కతీరుగా మాట్లాడి, పరువు తీసుకుంటున్నారని ఆరోపించారు.. గుజరాత్ ముందు తెలంగాణ ను మోకారిల్లేలా చేశారని విమర్శిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version