ఫొటో సాక్ష్యంః రేవంత్ రెడ్డి ఇన్నిపార్టీల్లో ప‌నిచేశారా!

రేవంత్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం చెప్ప‌మంటే చాలా మంది.. ‘‘టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చేశారు’’ అనే చెబుతారు. కానీ.. ఆయ‌న ఇత‌ర పార్టీల్లో కూడా ప‌నిచేశార‌ని కొంద‌రికే తెలుసు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న వేళ‌.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆయ‌న ప‌నిచేసిన పార్టీల్లో టీఆర్ఎస్ కూడా ఉండ‌డంతో.. ఈ పిక్ వైర‌ల్ అవుతోంది. రేవంత్ రెడ్డి పొలిటిక‌ల్ జ‌ర్నీ టీడీపీతో మొద‌లు […]

Written By: Bhaskar, Updated On : July 7, 2021 2:24 pm
Follow us on

రేవంత్ రెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం చెప్ప‌మంటే చాలా మంది.. ‘‘టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వ‌చ్చేశారు’’ అనే చెబుతారు. కానీ.. ఆయ‌న ఇత‌ర పార్టీల్లో కూడా ప‌నిచేశార‌ని కొంద‌రికే తెలుసు. తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న వేళ‌.. ఆయ‌న రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆయ‌న ప‌నిచేసిన పార్టీల్లో టీఆర్ఎస్ కూడా ఉండ‌డంతో.. ఈ పిక్ వైర‌ల్ అవుతోంది.

రేవంత్ రెడ్డి పొలిటిక‌ల్ జ‌ర్నీ టీడీపీతో మొద‌లు కాలేదు. దానిక‌న్నా ముందుగా టీఆర్ఎస్ తోనే ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. టీఆర్ఎస్ స్థాపించిన తొలినాళ్ల‌లో గులాబీ పార్టీలో ప‌నిచేసిన రేవంత్‌.. అప్పుడు కూడా క్రియాశీల‌కంగానే ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ‘పాల‌మూరు గ‌ర్జ‌న‌’ సభకు కేసీఆర్ ను ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి బ్యాన‌ర్లు క‌ట్టించ‌డం గ‌మ‌నార్హం. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు ప్ర‌ముఖంగా ఆక‌ర్షిస్తోంది.

ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో.. తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇక‌, అక్క‌డి నుంచి ఆయ‌న వేగంగా ఎదిగారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నేత‌గా ఎదిగారు. కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గాన్ని టీడీపీకి కంచుకోట‌గా మార్చారు. 2099లో ఉమ్మ‌డి రాష్ట్రంలో వైఎస్ హ‌వా కొన‌సాగ‌డంతో బ‌ల‌మైన‌ టీడీపీ నేత‌ల స్థానాలు సైతం గ‌ల్లంత‌య్యాయి. కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్ ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకొని విజ‌యం సాధించారు.

2014లో టీఆర్ఎస్ జోరును త‌ట్టుకొని కూడా నిలిచారు. గెలిచారు. అయితే.. 2018 ఎన్నిక‌ల్లో మాత్రం ఓడిపోయారు. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కు టీడీపీని వీడి, కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ త‌ర్వాత నిర్వ‌హించిన లోక్ స‌భ‌ ఎన్నిక‌ల్లో.. మ‌ల్కాజ్ గిరి లోక్ స‌భ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ ప‌ని అయిపోంద‌ని ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ.. ఆయ‌న గెల‌వ‌డం రేవంత్ స్థాయి ఏంట‌న్న‌ది తెలిసివ‌చ్చింది.

అయితే.. ‘ఓటుకు నోటు’ ఇష్యూ త‌ర్వాత రేవంత్ రేంజ్ మారిపోయింది. ఈ మ‌చ్చ‌ ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా మారుతుంద‌ని, రాజ‌కీయ జీవితం దెబ్బ‌తినిపోవ‌డం ఖాయ‌మ‌ని చాలా మంది అంచ‌నా వేశారు. కానీ.. రివ‌ర్స్ లో ఆయ‌న్ను పాపుల‌ర్ లీడ‌ర్ గా మార్చేసింది. ఈ కేసు విష‌యంలో అధికార టీఆర్ఎస్ ను రేవంత్ ఎదుర్కొన్న తీరు.. ఫైర్ బ్రాండ్ నేత‌గా నిలిపింది. ఇవాళ‌.. పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆయ‌న‌కు ద‌క్కడానికి ఒకే ఒక్క అర్హ‌త ఆయ‌న దూకుడే.

ఈ విధంగా.. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు పార్టీల్లో ప‌నిచేశారు రేవంత్‌. అంతేకాదు.. ప్ర‌త్య‌క్ష రాజకీయాల్లోకి రావ‌డానికి ముందు ఆయ‌న ఏబీవీపీ విద్యార్థి సంఘంలో ప‌నిచేశారు. అది బీజేపీ అనుబంధ సంఘం. అంటే.. ఆ విధంగా బీజేపీ రాజ‌కీయాల‌నూ చ‌విచూశార‌ని చెప్పొచ్చు. రేవంత్ రాజ‌కీయ ప్ర‌స్థానానికి సంబంధించిన పోస్ట‌ర్ పై మీరు కూ ఓ లుక్కేయండి.