Homeజాతీయ వార్తలుRevanth Reddy Letter To KCR: కాళేశ్వరంలో అవినీతి చేపలు.. విచారణ జరపాలంటున్న రేవంత్ రెడ్డి..

Revanth Reddy Letter To KCR: కాళేశ్వరంలో అవినీతి చేపలు.. విచారణ జరపాలంటున్న రేవంత్ రెడ్డి..

Revanth Reddy Letter To KCR: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవకతవకలు జరిగాయని గత కొద్ది రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కాగా, ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్ గురించి తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయమై తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. ప్రాజెక్టు వ్యయాన్ని మొదట్లో ఎంత ఉంచారు? తర్వాత అంచనా వ్యయం ఎందుకు పెంచారనేది స్పష్టం చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులో భాగంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దల నుంచి కాంట్రాక్టర్ కు చేతులు మారాయని, వీటన్నిటిపైన సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Revanth Reddy Letter To KCR
Revanth Reddy Letter To KCR

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరుగతోందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ అంటోందని, కానీ, తెలంగాణ సర్కారు అస్సలు పట్టించుకోలేదని రేవంత్ ఆరోపించారు. క్విడ్ ప్రోకో జరిగుతున్నట్టు ప్రతిపక్ష పార్టీలు అనుమానాలను వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తాజాగా ఆ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించే ఓ ప్రభుత్వ అధికారి కుటుంబ వేడుకకు సంబందించి లావాదేవీలు వెలుగులోకి రావడంతో అసలు బయటకు వచ్చిందని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Revanth Reddy Letter To KCR
Kaleshwaram Project

Also Read: కేసీఆర్‌ తీసుకున్న ఆ నిర్ణయం కరెక్ట్ కాదా.. వారికి ఛాన్స్ ఇచ్చేశారే..

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో ఓ న్యూస్ పోర్టల్ స్పష్టంగా ఆధారాలతో సహా కథనం ప్రచురించిందని, కానీ, ఈ విషయమై ప్రభుత్వం స్పందన లేదని రేవంత్ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులు చూస్తున్న ఐఏఎస్ అధికారి రజత్ కుమార్ అవినీతి‌కి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయన్నారు. రజత్ కుమార్ కూతురు పెళ్లి ఖర్చులను కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టు పొందిన మెగా, దాని షెల్ కంపెనీలు చెల్లించినట్లు కథనంలో ఆధారాలున్నాయని వివరించారు. గతేడాది డిసెంబర్ 17 – 18 హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ఫ్యాలాస్,తాజ్ డెక్కన్,తాజ్ కృష్ణా వంటి ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి వేడుకలు నిర్వహించినట్లు కథనంలో పేర్కొన్నారని రేవంత్ రెడ్డి లేఖలో చెప్పారు. సాగు నీటి శాఖ ప్రజెంట్ తెలంగాణ సీఎం వద్ద ఉన్న నేపథ్యంలో స్పందంచాలని డిమాండ్ చేశారు.

సాగునీటి శాఖ చూస్తున్న మంత్రిగానే కాకుండా ముఖ్యమంత్రి హోదాలో ఈ విషయంపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ ఆఫీసర్ రజత్ కుమార్ ముఖ్యమంత్రి పర్యవేక్షణలో పని చేస్తున్నారని, ఆరోపణలు వచ్చిన 48 గంటలు కావస్తున్నా సీఎంవో నుంచి ఖండన ప్రకటన రాలేకపోవడం వెనుక పలు అనుమానాలున్నాయని అంటున్నారు రేవంత్. కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి ఆరోపణలపై వాస్తవాలను తెలంగాణ సమాజానికి తెలపాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఈ మేరకు రేవంత్ రెడ్డి కేసీఆర్ లేఖ రాశారు.

Also Read: Konda Surekha-Revanth Reddy: రేవంత్ రెడ్డిపై సురేఖ ఆగ్రహానికి కారణాలేంటి?

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

2 COMMENTS

  1. […] Shruti Haasan: హీరోయిన్‌ శృతీహాసన్‌ ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్‌ తో పలు విషయాలను పంచుకోవడానికి ఇన్‌ స్టాగ్రామ్‌ లో లైవ్‌ చేస్తూ ఉంటుంది. ఇక జనవరి 25న తన పుట్టిన రోజును జరుపుకుంది ఈ బ్యూటీ. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ తెలిపింది. తన పై చూపించిన ప్రేమను మాటల్లో చెప్పలేనంటూ ఎమోషనల్‌ అవుతూ పనిలో పనిగా ఒక పోస్ట్‌ కూడా పెట్టింది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular