Shweta Tiwari: మధ్యప్రదేశ్ కి చెందిన యంగ్ హీరోయిన్ శ్వేతా తివారి ‘దేవుడు నా బ్రా సైజ్ కొలుస్తున్నాడు’ అని కామెంట్ చేసింది. తన వెబ్ సిరీస్‌ను ఉద్దేశిస్తూ అలా చెప్పింది ఆమె. తన సిరీస్ లో డైలాగ్ అట అది. ఆమె సరదాగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. దీని పై మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా పైగా మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్ర శ్వేతా తివారి కామెంట్స్ పై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించారు. దాంతో భయపడిపోయిన ఈ యంగ్ బ్యూటీ మొత్తానికి కాళ్ళ బేరానికి వచ్చింది. తన బ్రా సైజును దేవుడు కొలుస్తున్నాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తప్పు అంటూ శ్వేతా తివారి క్షమాపణ చెప్పింది.
Also Read: ఇతడి టార్గెట్ 150 అట.. ఇప్పటికీ 129మందికి తండ్రయ్యాడు..
తాను ఉద్దేశపూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. తన మాటలను వక్రీకరించారని చెప్పింది. సహ నటుడు సౌరభ్ పాత్రను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను దేవుడితో ముడిపెట్టారని పేర్కొంది. పనిలో పనిగా ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణ చెబుతున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

అయినా దేవుడిపై ఇష్టం వచ్చినట్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, భక్తులు ఎందుకు ఊరుకుంటారు ? మొత్తానికి శ్వేతా తివారి సరదా తీరింది. అన్నట్టు ఈ బ్యూటీ ఒక హిందీ సినిమాలో కూడా నటిస్తోంది. మరాఠీ, బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో ‘నయ్ వరన్ భట్ లోంచా కొన్ నయ్ కోంచా’ సినిమాలో శ్వేతా తివారి నటిస్తోంది. ఈ సినిమాలో శ్వేతా తివారి శృంగార సన్నివేశాల్లో అభ్యంతరకర రీతిలో రెచ్చిపోయిందట.
Also Read: కలెక్టర్ మేడమ్ మీరు మేకప్ ఎందుకు వేసుకోరు …?
[…] Gollapudi Maruti Rao: సినిమా పరిశ్రమలో మరో కన్నీటి విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామ సుందరి గారు మరణించారు. ఆమె వయసు 81 సంవత్సరాలు. వయోభారంతో చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. హన్మకొండలో జన్మించిన శివకామ సుందరికి గొల్లపూడితో 1961లో వివాహమైంది. 2019 డిసెంబరులో గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. […]