Homeఆంధ్రప్రదేశ్‌Revanth Reddy: వాళ్ల ఓట్లు మాత్రమే కావాలా.. నిరసనలు ఆంధ్రాలో చేసుకోవాలా? కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన...

Revanth Reddy: వాళ్ల ఓట్లు మాత్రమే కావాలా.. నిరసనలు ఆంధ్రాలో చేసుకోవాలా? కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన టీపీసీసీ చీఫ్‌!

Revanth Reddy: స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై ఆయన అభిమానులు, ఐటీ ఉద్యోగులు, టీడీపీ నాయకులు, ఆంధ్రా సెటిలర్లు హైదరాబాద్‌లో నిరసనలు తెలుపుతున్నారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. నిరసన ర్యాలీలు తీశారు. కానీ తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ మాత్రం నిరసనలు ఆంధ్రాలో చేసుకోవాలని హుకూం జారీ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలు నిరసన తెలిపినప్పుడు నోరు మెదపని ముఖ్యమైన మంత్రి.. హైదరాబాద్‌లోని ఆంధ్రా సెటిలర్లు నిరసలను మాత్రం తప్పు పట్టారు. నిరసనలు తెలుపుకోవాలంటే ఆంధ్రాకు పోవాలని ఆదేశించారు. ఇక్కడ ఇరసన తెలిపితే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.

బాగా బలిసి మాట్లాడుతున్నడు..
చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలుపుతున్న వారి గురించి కేటీఆర్‌ మాట్లాడిన తీరుపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి స్పందించారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండించారు. ‘సెటిలర్ల ఓట్లు కావాలి కానీ వారు నిరసనలు చేసుకోవాలంటే ఏపీకి వెళ్లి చేసుకోమ్మంటారా’ అని.. మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్‌పై రేవంత్‌ రెడ్డి నేరుగా ఇప్పటి వరకూ స్పందించలేదు. కానీ అరెస్టులపై నిరసనలు చేసుకోవడానికి అనుమతిచ్చేది లేదని కేటీఆర్‌ కామెంట్స్‌ చేసిన తర్వాత స్పందించారు. చంద్రబాబు అరెస్టు కేసుల గురించి మట్లాడలేదు కానీ.. కేటీఆర్‌ కామెంట్స్‌ను మాత్రం తప్పు పట్టారు. పదేళ్ల పాటు హైదరాబాద్‌ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అని, ఏపీకి సంబంధించిన అంశంపై ఇక్కడ నిరసన జరపొద్దు అంటే ఎలా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై నిరసనలు వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, ఆందోళన చేయొద్దని కేటీఆర్‌ వ్యాఖ్యలు చేయడం అర్ధరహితం అని అన్నారు. కేటీఆర్‌ బాగా బలిసి బలుపెక్కిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

బాబు ఏపీకి మాత్రమే నాయకుడు కాదు..
అసలు ఐటీ ఉద్యోగుల నిరసనల్లో తప్పేముంది అని రేవంత్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీకి మాత్రమే సంబంధించిన నాయకుడు కాదని.. ఆయన అరెస్ట్‌ జాతీయ అంశమని స్పష్టం చేశారు. ఆయన లాంటి అనుభవం ఉన్న వాళ్లను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చన్నారు.

నాడు అమెరికాలో ఎందుకు ధర్నా చేశారు?
చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలుపొద్దన్న కేటీఆర్‌ తెలంగాణ ఉద్యమం సమయంలో వైట్‌హౌస్‌ ముందే ఎందుకు ధర్నాలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అది తప్పు కానప్పుడు ఐటీ కారిడార్‌లో చేస్తే తప్పెలా అవుతుందన్నారు. చంద్రబాబు అరెస్టు విషయంలో తెలంగాణలో బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్‌ నేతలు కూడా ధైర్యంగానే స్పందించారు. బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ మాత్రమే.. తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది అన్నారు. రాజకీయ కక్ష సాధింపుల అరెస్ట్‌ అనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. అయితే టీపీసీసీ చీఫ్‌గా ఉన్నందున.. తన అభిప్రాయం మాత్రం రేవంత్‌ వెల్లడించలేదు. బాబు అరెస్ట్‌ను ఖండించలేదు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version