పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ వ్యతిరేకులను ఏకం చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకునే క్రమంలో అనుసరించిన వ్యూహాన్ని రేవంత్ అనుసరిస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకమా? అనుకూలమా?అనే నినాదాలతో టీఆర్ఎస్ లో చేరాల్సిందిగా ఒత్తిడి పెంచారు. చాలా మందికి నజరానాలు సైతం ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. కేసీఆర్ పై వ్యతిరేకతను ఉపయోగించుకుని కేసీఆర్ కు వ్యతిరేకమా?అనుకూలమా? అని నేతల వద్దకు వెళుతున్నారు.
కేసీఆర్ కు చెక్ పెట్టాలంటే అందరు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడుతున్నారు. విడివిడిగా ఉంటే కష్టమని కలిసి పని చేద్దామని చెబుతున్నారు. తాజాగా దేవేందర్ గౌడ్ ఇంటికి వెళ్లి ఆయనను కాంగ్రెస్ లో చేరాల్సిందిగా కోరారు. అనారోగ్య కారణాలతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన కొడుకు వీరేందర్ గౌడ్ బీజేపీలో ఉప్పల్ నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ కుటుంబాన్ని కాంగ్రెస్ లోకి రావాలని ఆకాంక్షించారు.
బీజేపీలో ఉంటే కేసీఆర్ పై పోరాటం సాద్యం కాదని సూచించారు. కాంగ్రెస్ లో ఉంటేనే సాధ్యమని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పై వ్యతిరేకత ఉన్న లీడర్లనే రేవంత్ టార్గెట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు దూరమైన కొండా విశ్వేశ్వర్ రెడ్డిని మళ్లీ పార్టీలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కేసీఆర్ పై కరడుగట్టిన వ్యతిరేకత ఉన్న నేతలందరిని తమ వైపు తప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో కేసీఆర్ అనుసరించిన వ్యూహాన్నే తెలంగాణ రాజకీయాల్లో అమలు చేస్తున్నారు.
తెలలంగాణలో కాంగ్రెస్ లో జవసత్వాలు నింపేందుకు అనుక్షణం పాటుపడుతున్నారు. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చూస్తున్నారు. కేసీఆర్ ను దెబ్బ కొట్టాలనే వ్యూహంలో భాగంగా ముందుకు వెళ్తున్నారు. కేసీఆర్ వ్యతిరేకుందరిని కలుపుకుని అధికార పార్టీని దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా తమ వైఖరి మార్చుకుంటున్నారు. ఎలాగైనా టీఆర్ఎస్ ను ఓడించాలనే తపనతో ఉన్నారు.