20 నెలల లెక్క.. రేవంత్ వ్యూహం పక్కా

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం పక్కాగా చేస్తున్నారు. రాబోయే 20 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం అంతవరకు సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసే పన్నాగాలను పసిగట్టి ఆయనకు సవాలు విసిరే రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాబోయే ఎన్నికలు 20 నెలల్లో జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేవంత్ వ్యూహాలపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత […]

Written By: Srinivas, Updated On : August 10, 2021 12:15 pm
Follow us on

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎన్నికల వ్యూహం పక్కాగా చేస్తున్నారు. రాబోయే 20 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం అంతవరకు సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. సీఎం కేసీఆర్ అమలు చేసే పన్నాగాలను పసిగట్టి ఆయనకు సవాలు విసిరే రేవంత్ రెడ్డి ప్రస్తుతం రాబోయే ఎన్నికలు 20 నెలల్లో జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రేవంత్ వ్యూహాలపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో పీసీసీ పగ్గాలు చేపట్టిన తరువాత రేవంత్ రెడ్డి పార్టీని గాడిలో పెట్టే పనిలో పడిపోయారు. అందరిని కలుపుకుని నేతలను తమ దారిలోకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలను అంచనా వేసి వారిని దెబ్బకొట్టే వైఖరులపై ఎప్పటికప్పుడు ప్లాన్లు వేస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉన్న నిరుత్సాహం దూరం చేసి వారిలో ఉత్సాహం పెరిగేలా చేస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తున్న అధికార పార్టీ విధానలను ఎండగట్టే పనిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు తెలిపేందుకు పావులు కదుపుతున్నారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ అమలు చేస్తున్న పథకాలన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమేనని విమర్శిస్తున్నారు. టార్గెట్ 20 నెలల కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారమైతే తెలంగాణలో 2023 నవంబర్ లో ఎన్నికలు వస్తాయని కానీ రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం 2023 మార్చిలోనే రావచ్చని చెబుతున్నారు. వచ్చే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారని రేవంత్ జోస్యం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తున్నారు.

కేసీఆర్ వ్యూహాన్ని ఇలా పక్కాగా అంచనా వేస్తున్నారనే విషయంపై ఎవరికి అంతు చిక్కడం లేదు. కానీ రేవంత్ వ్యూహంలో మరో కోణం కూడా దాగి ఉందని తెలుస్తోంది. 20 నెలల్లో పార్టీ శ్రేణులను ఎన్నికలకు రెడీ చేయగలిగితే అదే ఊపులో ఉండి పార్టీ విజయానికి శ్రమిస్తారని తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను కార్యోన్ముఖులను చేయడానికే ఈ విధమైన వ్యూహం ఎన్నుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

దీంతో 20 నెలల కాలాన్ని ప్రాతిపదికగా తీసుకుని రేవంత్ రెడ్డి అందరిలో ఉత్సాహం పెరిగేలా నూతనోత్తేజం నింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా విజయం సాధించే క్రమంలో భాగంగా కార్యకర్తల్లో ఉన్న నైరాశ్యాన్ని పోగొట్టి వారిని పార్టీ కోసం కష్టపడేలా చేయాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యూహంపై అందరు కూడా రెడీ అయిపోతున్నారు. లక్ష్యం 20 నెలలు అని ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.