Revanth Reddy: తెలంగాణలో ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీల్లో నెలకొన్న విభేదాల దృష్ట్యా విస్తుపోయే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని ఇందులో భాగంగానే బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడం ఓ నాటకంగా అభివర్ణించడం గమనార్హం. దీంతో తెలంగాణలో పరిస్థితులపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. అసలు రాష్ర్టంలో ఏం జరుగుతోంది? పార్టీల్లో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో రోజురోజుకు పరిస్థితులు మారుతున్నాయి.

జనవరి 2న జాగరణ దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టును కాంగ్రెస్ పార్టీ ఓ నాటకంగా అభివర్ణిస్తోంది. బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కుదిరిన రహస్య ఒప్పందంలో భాగమే అరెస్ట్ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో అలజడి రేపుతోంది. బండి సంజయ్ అరెస్టును అంతలా ప్రాచుర్యం చేయడంలో రెండు పార్టీల చాకచక్యం కనిపిస్తోందని ఎద్దేవా చేశారు.
Also Read: కేసీఆర్ కు షాక్.. బీజేపీ ప్రతిఘటన.. రక్తికడుతున్న తెలంగాణ రాజకీయం
మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లో చేపట్టిన కొవ్వొత్తుల ర్యాలీపై కూడా ఓ కామెంట్ చేసి రేవంత్ రెడ్డి అందరిలో ఆలోచనలు రేకెత్తించారు. జేపీ నడ్డాను కూడా హైదరాబాద్ లో అరెస్టు చేస్తారని ఓ వాదన లేవనెత్తారు. దీంతో నడ్డాను అరెస్టు కాకుండా కాపాడింది రేవంత్ రెడ్డే అనే పుకార్లు వ్యాపించాయి. దీంతో రాష్ర్టంలో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
రాబోయే ఎన్నికల నాటికి ఇంకా పార్టీల్లో మార్పులు చోటుచేసుకుంటాయని తెలుస్తోంది. రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న సందర్భంలో రేవంత్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ములాఖత్ అయ్యాయని కొత్త పల్లవి అందుకున్నారు. ఇందులో భాగంగానే ప్రజల దృష్టిని మళ్లించేందుకే అరెస్టుల డ్రామాలు ఆడుతున్నాయని విమర్శిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లతో అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అసలు ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవమెంత? వాటికి ఏ ఆధారాలున్నాయి? అనే అంశాలపై అందరికి ఆసక్తి పెరుగుతోంది. మొత్తానికి రాష్ర్టంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో రాజకీయాలు ఎటు వైపు వెళుతున్నాయనే ఆందోళన అందరిలో కనిపిస్తోంది.
Also Read: బీజేపీ ని టార్గెట్ చేస్తున్న టీఆర్ఎస్.. అక్రమ అరెస్టులపై బీజేపీ నేతల గుర్రు