Revanth Reddy: హుజూరాబాద్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆసక్తి రేకెత్తించాయి. అక్కడ ఎన్నికలు అనుకున్నప్పటి నుంచి రాష్ట్ర ప్రజలు అందరూ దాని గురించే చర్చించుకున్నారు. మొత్తానికి ఎన్నికలు సజావుగా సాగి ఫలితాలు కూడా వచ్చేశాయి. అయితే ఇప్పుడు ఆ ఫలితాల గురించి గత రెండు రోజులుగా చర్చ నడుస్తూనే ఉంది. సామాన్య ప్రజల కంటే ఈ ఫలితం గురించి ఎక్కువగా రాజకీయ పార్టీలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నాయి.

పార్టీల సమాలోచనలు, అంతర్మథనాలు..
హుజూరాబాద్‌లో విజయం సాధించిన బీజేపీ ఫుల్ జోష్‌లో ఉంది. ఇక పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా సంస్థాగతంగా బలోపేతం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దాని కోసం ఏం చేయాలని సమాలోచనలు చేస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాన్ని కోల్పొయిన టీఆర్ఎస్ అంతర్మథనంలో పడింది. ఈటెల విషయంలో తొందపడ్డామా ? అనే ఆలోచనలో ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ భవిత్యవంపై పడకుండా ఉండేలా ఏం చర్యలు తీసుకోవాలనే అంశంపై ఆ పార్టీలో చర్చ కొనసాగుతోంది.
రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకుల గుస్సా..
హుజూరాబాద్ ఫలితం టీఆర్ఎస్‌ను కలవరపెట్టినా.. అంతకంటే ఎక్కువ కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టింది. ఆ ఫలితం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఇంకా వెంటాడుతూనే ఉంది. హుజూరాబాద్‌లో బీజేపీతో రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారని, అందుకే కాంగ్రెస్‌కు అక్కడ డిపాజిట్ కూడా దక్కలేదని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్‌కు హుజూరాబాద్‌లో 60 వేల ఓట్లు వచ్చాయని ఈ సారి అది 3వేలకే పరిమితం అవడం కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ లో సీనియర్ లు ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నారు. హుజూరాబాద్ ఫలితాలు వెలువడిన వెంటనే ఆ పార్టీ సీనియర్లు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి మాట్లాడిన విషయం దీనికి ఊతమిస్తోంది. టీఆర్ఎస్‌ను ఓడించాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ బలంగా పోటీ చేయలేదని చెప్పారు. జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేశారు.
అనంతరం రేవంత్ రెడ్డి స్పందించారు. హుజూరాబాద్ ఓటమి బాధ్యత పూర్తిగా తనదే అని అన్నారు. కాంగ్రెస్ లో సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువని అందుకే వారు మాట్లాడుతున్నారని, అవసరమైనప్పుడు తాను స్పందిస్తానని పరోక్షంగా హెచ్చరించారు.
Also Read: Narendra Modi: ఆ కేదారేశ్వరుడి రుణం తీర్చుకోబోతున్న నరేంద్రమోడీ
ఇప్పటికీ రేవంత్ ను వెంటాడుతున్న ఫలితం..
రేవంత్ రెడ్డిని హుజూరాబాద్ ఫలితం ఇంకా వెంటాడుతోంది. ఇటీవల జరిగిన పీసీసీ సమావేశంలో పార్టీ సీనియర్లు రేవంత్ ను టార్గెట్ చేస్తూ మాట్లాడారని తెలుస్తోంది. ఆయనను ఎప్పటి నుంచో ఇరికించాలని చూస్తున్న ఆ నాయకులకు ఈ ఓటమి కలిసివచ్చింది. కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో ఇక్కడ రేవంత్ కుమ్మక్కు అయ్యారని ఆరోపణలు చేశారు. అయితే హుజూరాబాద్ ఫలితం ఇలా తనకు రివర్స్ అవుతుందని రేవంత్ రెడ్డి కూడా ఊహించలేదు. మొదటి నుంచీ ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు. పార్టీ అభ్యర్థిని లేట్‌గా ప్రకటించడం దగ్గర నుంచి, ప్రచారం నిర్వహించడంలోనూ అలసత్వంగానే ఉన్నారు. ఆయనకు మొదటి నుంచి హుజూరాబాద్ తమకు దక్కదనే భావనలోనే ఉన్నారు. రేవంత్ రెడ్డి దృష్టి అంతా పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా కింది స్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ వచ్చి, పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే అంశంపైనే ఉంది. మధ్యలో ఈ ఎన్నికలు వచ్చినా కూడా అక్కడ గెలువడం కష్టమనే భావనలోనే ఉన్నారు. కానీ పార్టీ నుంచి అక్కడ పోటీ ఉండాలనే ఉద్దేశంతో నామమాత్రంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కానీ అదే ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతుందని ఊహించి ఉండకపోవచ్చు.
Also Read: MP Raghurama: ఈటల అయిపోయే!.. ఇప్పుడు రఘురామకు మొదలైంది?