Revanth Reddy: ఒకటి కాదు రెండు.. ఏకంగా వరుసగా ఐదు రోజుల పాటు.. కుండపోత వానలు. ఈ వానలకు ఊరువాడా అన్నీ మునిగాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలంను ముంచేసింది. ప్రాజెక్టులపైనుంచి నీళ్లు దుమికాయి. తెలంగాణ అంతా అల్లకల్లోలమైంది. గోదావరి నది చుట్టుపక్కల కూడా అంతా వరద నీరే. అంతటి మహోగ్రవ వర్షపాతంలో గోదావరి పక్కన ఉండే ప్రాంతాలు అన్నీ మునిగాయి. ఈక్రమంలోనే కాళేశ్వరం పంప్ హౌస్ లు నీట మునిగాయి. వాటితో కోట్ల నష్టం వాటిల్లింది.

‘తెలంగాణ ప్రజల కష్టార్జితం నీటి పాలైంది.. కేసీఆర్ అవినీతికి బలైంది’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పరిపాలన వైఫల్యాలను ఎండగట్టారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని కీలకమైన ‘అన్నారం’ పంప్ హౌస్ నీటి మునిగిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.
వరుసగా ఐదురోజుల పాటు విడవకుండా కురిసిన వానలకే ఊళ్లకు ఊళ్లు మునిగిపోయిన వేళ గోదావరి ఒడ్డున ఉండే ప్రాంతాలు మునగవా? అంటే ఖచ్చితంగా మునుగుతాయి. వాటిని టీపీసీసీ చీఫ్ షేర్ చేసి ప్రస్తావించడమే అందరూ విడ్డూరంగా ఉందంటున్నారు.
కాళేశ్వరంలోని అన్నారం పంప్ హౌస్ మునిగితే కోట్లలో నష్టం. కానీ ఇది ప్రకృతి విపత్తు. ఒకచోట వర్షం కొట్టి మరో చోట కొట్టలేదు అనడానికి లేదు. ఇందులో కేసీఆర్ ను తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఉత్తర తెలంగాణ అంతటా అదే వర్షం. దాని ధాటికి అందరూ బాధితులుగా మారారు. ఈ వాన ఉరుపులో ఏదీ మునగకుండా ఉండలేదు. అన్నారం పంప్ హౌస్ కూడా అలానే మునిగింది.
తెలంగాణ ప్రజల కష్టార్జితం కేసీఆర్ అవినీతికి బలైందని రేవంత్ ట్వీట్ చేశారు. కానీ ఈ వానల ధాటిని మాత్రం రేవంత్ గుర్తించలేకపోయారు. ఎత్తైన, లోతైన ప్రాంతాలన్నీ ఉత్తర తెలంగాణలో మునిగిపోయాయి. అన్నారం పంప్ హౌస్ గోదావరి ఒడ్డునే ఉంటుంది. గోదావరి గడిచిన నాలుగు దశాబ్ధాల్లోనే అత్యంత ఉగ్రరూపంతో ప్రవహించింది. దాన్ని అవినీతి కోణంలో రేవంత్ ప్రొజెక్ట్ చేశారు.
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం
(అన్నారం పంప్ హౌస్)
నీళ్లలో నిండా మునిగింది.తెలంగాణ ప్రజల కష్టార్జితం
కేసీఆర్ అవినీతికి బలైంది.@TelanganaCMO pic.twitter.com/i7io91eq2T— Revanth Reddy (@revanth_anumula) July 14, 2022
[…] Also Read: Revanth Reddy: రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళే… […]