Getup Srinu: తెలుగు బుల్లితెర పై మోస్ట్ హాట్ జోడీ ఎవరంటే కచ్చితంగా ముందు చెప్పే జోడీ ‘రష్మీ-సుడిగాలి సుధీర్’. వీళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ముందు టిఆర్పి రేటింగ్ ఓ రేంజ్ లో వస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఏదో వ్యవహారం సాగుతోందని ఇప్పటికీ చాలా రకాలుగా పుకార్లు వచ్చాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఉంది. తమ జోడికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గకుండా.. ఇద్దరూ అదే ఫీల్‌ను కొనసాగిస్తూ బాగానే క్యాష్ చేసుకున్నారు. అయితే, నిజంగా వీరి కెమిస్ట్రీ చూసినవారు నిజంగానే రష్మీ సుధీర్ లవర్స్ ఏమో, త్వరలో పెళ్లికూడా చేసుకుంటారేమో అని నమ్ముతూ ఉంటారు.

దాంతో.. ఎప్పటికప్పుడు వీరి పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాలో నానుతూనే ఉంటుంది. మరి వీరి ప్రేమలో ఎంత నిజం ఉందో.. తాజాగా గెటప్ శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గెటప్ శ్రీను తాజాగా ఒక చాట్ సెషన్ నిర్వహించాడు. ఈ క్రమంలో అతనికి సుధీర్ రష్మీ పెళ్లి గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. సుధీర్ – రష్మీ పెళ్లి చేసుకోరు. షూటింగ్ అయిన తర్వాత రష్మీ ది వేరే లోకం సుధీర్ ది వేరే లోకం. కేవలం ప్రేక్షకులను రంజింప చేయడం కోసమే వారు తెరపై లవర్స్ లా కనిపిస్తారు. దయచేసి ఇది అందరూ అర్థం చేసుకోవాలి అంటూ శ్రీను చెప్పుకొచ్చాడు.
Also Read: Ravi Teja: ఇటు మార్కెట్ పడిపోతుంది.. అటు రెమ్యునరేషన్ పెంచుతున్న రవితేజ
ఇక గెటప్ శ్రీను కూడా జబర్దస్త్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సినిమాల పై శ్రీను ఫోకస్ చేయబోతున్నాడు. సుధీర్ విషయానికి వస్తే.. సుడిగాలి సుధీర్ కి బుల్లితెర పై విపరీతమైన క్రేజ్ ఉంది. మహిళా ప్రేక్షకులు కూడా అతని అల్లరిని ఇష్టపడుతూ ఉంటారు. ఇక సుధీర్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ గత కొన్ని నెలలుగా వస్తోన్న పుకార్ల పరంపరకు బ్రేక్ లు పడటం లేదు.

ఈ రూమర్ల పై గతంలోనే సుధీర్ క్లారిటీ ఇచ్చినా, రష్మీ గౌతమ్ తో ప్రేమలో మునిగి తేలుతున్నాడంటూ వచ్చే రూమర్లకు మాత్రం అడ్డు అదుపు లేకుండా పోతుంది. మరోపక్క సుధీర్ మాత్రం తానూ హీరోగా కూడా సక్సెస్ అయ్యాక, పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఎలాగూ బుల్లి తెర పై సూపర్ సక్సెస్ అయ్యాడు కాబట్టి, వెండితెరను టార్గెట్ చేశాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద సుధీర్ హీరోగా నిలబడటం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్ లాంటి రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు.
Also Read:The Warrior Collections: ‘ది వారియర్’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఏ ఏరియాలో ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
[…] Also Read: Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ… […]
[…] Also Read: Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ… […]
[…] Read:Getup Srinu: సుధీర్ – రష్మి పెళ్లి పై గెటప్ శ… Recommended […]