Revanth Reddy
Revanth Reddy : ఇటీవల తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సిఫారసు లేఖలకు ఏపీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆమె ఆరోపించారు. ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆమె కోరారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చొరవ చూపాలని ఆమె కోరారు. ఇక ఇటీవల భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంటు సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్పందించింది. సిఫారసులేఖలకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఈ గొడవ తగ్గినట్టేనని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంలో గురువారం రవీంద్ర భారతి వేదికగా నిర్వహించిన కొలువుల పండుగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి తేనె తుట్టెను కదిపాయి.
Also Read : అర్హులకే రూ.4 లక్షలు.. ఎవరికి ఇస్తామో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి!
రేవంత్ ఏమన్నారంటే..
తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ఇస్తున్న సిఫారసులేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోకపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు..” తిరుమల లో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం మనం లేఖలు ఇవ్వడం ఏంటి.. తిరుమల తిరుపతి దేవస్థానం పట్టించుకోకపోవడం ఏంటి.. తిరుమల లోనే దేవుడు ఉన్నాడా? మనకు భద్రాచలం రాముల వారు లేరా.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి లేరా.. రామప్పలో శివుడి అంశ మనకు ఉంది కదా. వాళ్లకు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంటే.. మనం వైటిడిఏ ఏర్పాటు చేసుకుందాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి తమ సిఫారసులేఖలకు ప్రాధాన్యం లభించడం లేదని ఇటీవల కొంతమంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి కొద్దిరోజులుగా చర్చలు సాగిస్తున్నారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆలస్యంగా స్పందించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.. తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలకు ప్రాధాన్యం లభించకపోవడానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను గులాబీ అనుకూల సోషల్ మీడియా తెగ ప్రచారం చేస్తోంది. కాకపోతే దీనికి నెగిటివ్ కలర్ ఇస్తోంది. సోషల్ మీడియాలో గులాబీ పార్టీ ఆరితేరి ఉంది కాబట్టి.. చంద్రబాబును ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ప్రచారం మొదలుపెట్టింది. ఇక సోషల్ మీడియాలో గులాబీ అనుకూల నెటిజన్లు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read : రెండోసారీ నేనే ముఖ్యమంత్రి… రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి?
టీటీడీ దర్శనాలకు చంద్రబాబును అడుక్కునుడు ఏంది? మనకి మన గుడులు లేవా?
వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ ఉంది – రేవంత్ రెడ్డి pic.twitter.com/Nz7BVm8QnZ
— Telugu Scribe (@TeluguScribe) March 20, 2025