రేవంత్ రెడ్డి సీఎం.. కాంగ్రెస్ లో బయటపడ్డ నిప్పు

నోరున్నవాడిదే ఇప్పుడు లోకం.. ఆ నోరు లేకుంటే వెనుకబడి పోతాం.. ఆ నోరు సోషల్ మీడియా కావచ్చు. లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు.. వెబ్ మీడియాను కావచ్చు. ఒక ప్రచారాన్ని అదే పనిగా రిపీట్ చేస్తుంటే నిజంగానే అదే జరిగిపోతుంటుంది. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటుంటారు. తాజాగా తెలుగు మీడియాలో ఒక వార్త విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో కానీ.. రేవంత్ […]

Written By: NARESH, Updated On : August 13, 2020 6:08 pm
Follow us on


నోరున్నవాడిదే ఇప్పుడు లోకం.. ఆ నోరు లేకుంటే వెనుకబడి పోతాం.. ఆ నోరు సోషల్ మీడియా కావచ్చు. లేదా ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు.. వెబ్ మీడియాను కావచ్చు. ఒక ప్రచారాన్ని అదే పనిగా రిపీట్ చేస్తుంటే నిజంగానే అదే జరిగిపోతుంటుంది. దాన్నే గోబెల్స్ ప్రచారం అంటుంటారు.

తాజాగా తెలుగు మీడియాలో ఒక వార్త విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నాడో లేక ఆయన అభిమానులు వైరల్ చేస్తున్నారో కానీ.. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ అధినేత్రి కూతురు ప్రియాంక గాంధీ ఖాయం చేశారని.. అధికారంలోకి తీసుకొస్తే సీఎం నువ్వేనని రేవంత్ కు అభయం ఇచ్చారనే వార్త రెండు మూడు రోజులుగా మీడియాలో హైలెట్ అవుతోంది.

Also Read: తెలంగాణ పీసీసీ ఛీఫ్ కోసం కర్ణాటకలో రాజకీయాలు?

దేశ రాజకీయాల్లో ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ యాక్టివ్ అయ్యారు. రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను చేరదీసి మళ్లీ అక్కడి ప్రభుత్వాన్ని కాపాడడంలో కీలకపాత్ర పోషించారు.దేశ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రియాంక గాంధీ కీలకపాత్ర పోషించబోతోందని తెలిసింది. ఈ క్రమంలోనే సీనియర్లకు మంగళం పాడి యువ నేతలకు అందలం ఎక్కించాలని ఆమె పక్కా ప్లాన్ సిద్ధం చేసినట్టు తెలిసింది.

ప్రియాంక గాంధీ అన్ని రాష్ట్రాల్లో యూత్ ని ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యిందట.. అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ కు జవసత్వాలు నింపేందుకు నిర్ణయం తీసుకుందని సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ కు విపరీతంగా ఓటు బ్యాంకు ఉంది.. కర్ణాటక తర్వాత రెడ్డి సామాజికవర్గం అండ తెలంగాణలో కాంగ్రెస్ కే ఉంది. తెలంగాణలో రెడ్డి సామాజికవర్గానికే పీసీసీ పీఠం ఇవ్వాలని ప్రియాంక ఒత్తిడి తెస్తోందట.. అందులో యువనేత రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లను ప్రియాంక గాంధీ పరిశీలిస్తున్నట్టు ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కోమటిరెడ్డిని సెంట్రల్ టీమ్ లో వేసి.. రేవంత్ రెడ్డికి రాష్ట్ర పీసీసీ ఇస్తే సరిపోతుందని ప్రియాంక భావిస్తోందని వార్తలు వెలువడ్డాయి. తెలంగాణ పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ రెడ్డిని నియమించడం ఖాయమని.. ఆయన ప్రియాంక టీంలోకి వెళ్లిపోతున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

Also Read: కేసీఆర్ తో కయ్యానికి సిద్ధమవుతున్న జగన్?

ఈ వార్తలపై తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో రేవంత్ రెడ్డి లాంటి నేతలను చూడలేదని.. సీఎం అంటూ ఇప్పుడే ప్రచారం చేసుకోవడం ఆపాలంటూ హితవు పలికారు. మాలాంటి సీనియర్ నేతలపై సోషల్ మీడియాలో అడ్డగోలు కామెంట్స్ చేస్తున్నారని అన్నారు. వెంటనే కోర్ కమిటీ సమావేశం పెట్టి రేవంత్ అంతు తేలుస్తామని వీహెచ్ తొడగొట్టారు. ప్రియాంక టీం అంటూ సోనియా కుటుంబంలోనూ రేవంత్ చిచ్చు పెడుతున్నాడని.. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇక ఇప్పటికే రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా కాంగ్రెస్ సీనియర్లంతా అడ్డుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ప్రియాంక టీంలో చేరిన రేవంత్ పై సీనియర్లు అంతా కలిసి అడ్డుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. మరి ప్రియాంక వర్గం పట్టుదల గెలుస్తుందా? కాంగ్రెస్ సీనియర్ల పంతం నెగ్గుతుందా అన్నది వేచిచూడాలి. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ కాకుండా బాగానే అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.

-ఎన్నం