Amith Shah: కశ్మీర్ బుల్లెట్ లకు ఎదురునిలిచి.. ధైర్యం అంటే అమిత్ షాదే?

Amith Shah: బుల్లెట్లకు ఎదురునిలిచే ధైర్యం.. తూటాలకు ఎదురునిలబడి ప్రసంగించే మొండి పట్టుదల ఈరోజు ఎవరికి ఉంటుంది.. ఉక్కు గుండెలకు ఉంటుంది. అలాంటి ఉక్కు సంకల్పం ఈ గుజరాతీ నేతకు ఉంది. కేంద్రహోంమంత్రి అమిత్ చేసిన ఈ పనికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నాయకుడంటే నడిపించాలి.. ముందుండి కొనసాగాలి.. అప్పుడే ఆ నాయకుడికి గౌరవం దక్కుతుంది. ప్రజలు, తమను నమ్మిన వారికి ధైర్యం నింపాలంటే ముందు మనం గట్టిగా నిలబడాలి. వారిలో ధైర్యం నింపాలి.. ఇప్పుడు అమిత్ […]

Written By: NARESH, Updated On : October 25, 2021 6:21 pm
Follow us on

Amith Shah: బుల్లెట్లకు ఎదురునిలిచే ధైర్యం.. తూటాలకు ఎదురునిలబడి ప్రసంగించే మొండి పట్టుదల ఈరోజు ఎవరికి ఉంటుంది.. ఉక్కు గుండెలకు ఉంటుంది. అలాంటి ఉక్కు సంకల్పం ఈ గుజరాతీ నేతకు ఉంది. కేంద్రహోంమంత్రి అమిత్ చేసిన ఈ పనికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.

amitshahbulletproofglass-1635159853

నాయకుడంటే నడిపించాలి.. ముందుండి కొనసాగాలి.. అప్పుడే ఆ నాయకుడికి గౌరవం దక్కుతుంది. ప్రజలు, తమను నమ్మిన వారికి ధైర్యం నింపాలంటే ముందు మనం గట్టిగా నిలబడాలి. వారిలో ధైర్యం నింపాలి.. ఇప్పుడు అమిత్ షా అదే చేశాడు.

కశ్మీర్… పాకిస్తాన్ ఉగ్రవాదానికి అనాదిగా బలవుతున్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేసి రాష్ట్రంగా విడగొట్టి ఆర్టికల్ 370ని రద్దు చేసి కేంద్రహోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ దేశ చరిత్రలోనే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. వారి ధైర్యానికి అందరూ సలాం చేశారు. ఇప్పుడు అమిత్ షా చేసిన పనికి కూడా అంతే ప్రశంసలు కురుస్తున్నాయి..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా కశ్మీర్ లో పర్యటించారు. అణువణువు ఉగ్రవాదంతో.. తుపాకుల మోతతో.. ఎప్పుడూ ఏ తూట పేలుతుందో తెలియని అక్కడ అమిత్ షా ధైర్యంగా నిలబడి తన మొండి గుండె ధైర్యం అని నిరూపించారు.

శ్రీనగర్ పర్యటనలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా అందరినీ ఆశ్చర్యపరిచారు. వేదిక మీదకు చేరుకోగానే మొదట అక్కడ ఏర్పాటు చేసిన బులెట్ ప్రూఫ్ అద్దాలను తొలగించమని ఆదేశించారు. ఈ చర్య కశ్మీర్ ప్రజలలో వారిపై విశ్వాసాన్ని.. కశ్మీర్ పరిస్థితిని మార్చడంలో మోదీ ప్రభుత్వం సంకల్పాన్ని తెలియజేస్తుందన్నారు. అమిత్ షా చేసిన ఈ సాహసంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

వీడియో ఇదే..