Kerala CM Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ది ప్రత్యేక శైలి. పరిపాలనలో ఆయన అవలంభించే విధానాలే ఆయనకు రెండో సారి సీఎం పీఠం దక్కేలా చేసిందని చెబుతారు. ఇటీవల ఆయన ఆరోగ్య చికిత్స కోసం అమెరికా వెళ్లారు. అక్కడే మూడు వారాల పాటు చికిత్స తీసుకుంటారు. దీంతో పరిపాలన వ్యవహారాలు చూసుకోవడానికి ఎవరికి బాధ్యతలు మాత్రం అప్పగించలేదు. దీంతో అక్కడ నుంచే పరిపాలన వ్యవహారాలు చూస్తానని తెలియడంతో అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి బెడ్ మీద నుంచే బాధ్యతలు నెరవేర్చే అవకాశం ఏర్పడింది.

గతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీఆర్ కూడా ఇలాగే చికిత్స కోసం అమెరికా వెళితే ఆయనకు పదవి దక్కకుండా పోయింది. దీంతో అదే భయంతోనే విజయన్ ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. సాధారణంగా సీఎంలు వేరే దేశాలకు వెళ్లినప్పుడు నమ్మకస్తులైన వారికి పాలనా వ్యవహారాలు అప్పగించడం రివాజు. దీంతో విజయన్ నిర్ణయం చూస్తే ఆయన ఎవరిని విశ్వసించరని తెలుస్తోంది.
Also Read: కరోనా పాజిటివ్ వచ్చిందా.. త్వరగా కోలుకోవాలంటే తీసుకోవాల్సిన ఆహారాలివే?
విజయన్ మాత్రం ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఎవరిని పూర్తిగా నమ్మరని తెలుస్తోంది. దీంతో ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనకు వెళ్లినా ఎవరికి బాధ్యతలు అప్పగించలేదని చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం కమ్యూనిస్టులకు ఉన్న ఒకే ఒక రాష్ర్టం కేరళ. దీంతో దాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేనట్లు భావిస్తున్నారు.
దీంతో విజయన్ అమెరికా నుంచే వర్చువల్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. అధికారిక కార్యక్రమాలను అక్కడి నుంచే నిర్వహిస్తున్నారు. ఆయనకు ఎవరిపై కూడా విశ్వాసం లేకనే బాధ్యతలు ఎవరికి అప్పగించలేదని తెలుస్తోంది. ఆయన కోరికను కూడా ఎవరు కాదనలేకపోతున్నారు. ఎవరికైనా బాధ్యతలు అప్పగిస్తే పరిస్థితులు వేరే ఉంటాయనే భావనతోనే విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరిని కూడా అంత తేలిగ్గా నమ్మడం లేదు. ఎందుకంటే విశ్వాసమనేది కనిపించడం లేదు. ఎంత నమ్మకస్తుడైనా అవకాశం వస్తే అధికారం చేజిక్కించుకోవడానికే ప్రయత్నిస్తారు. అందుకే విజయన్ ఎవరి చేతిలో అధికార పగ్గాలు ఉంచకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది.